Master Bharat : మాస్టర్ భరత్ అంటే కొందరికి వెంటనే స్ట్రైక్ కాకపోవచ్చు కాని రెడీ సినిమాలోని బాల నటుడు అంటే మాత్రం ఠక్కున గుర్తు పడతారు. ఇందులో భరత్ పండించిన హాస్యం మాములుగా లేదు. ఈ సినిమానే కాకుండా భరత్… వెంకీ, ఢీ, కింగ్, బిందాస్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి 80కి పైగా చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించారు. మాస్టర్ భరత్ పెద్దవాడై అల్లు శిరీష్ ‘ABCD’ చిత్రంతో సెకండ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. అయితే తన కామెడీతో కడుపుబ్బ నవ్వించిన భరత్ జీవితంలో విషాదం కూడా ఉంది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన తన కుడి కన్ను కనిపించదని అన్నాడు.
ఊహతెలిసినప్పుటి నుండి సినిమాల్లో నటిస్తూనే ఉన్నా.. మూడేళ్ల వయసు నుండి నటిస్తున్నా. ఒకవైపు సినిమాలు చేస్తూనే మెడిసిన్ పూర్తి చేశా. ప్రస్తుతం మెడిసిన్‌లోనే డాక్టరేట్ చేస్తున్నా. చైల్డ్ ఆర్టిస్ట్ నుండి ఇప్పుడు పెద్దవాడినయ్యా. స్కూల్, కాలేజ్ అంతా అయిపోయింది కాని నేను ఇంకా అమ్మచాటు బిడ్డనే. లవ్ లాంటివేం లేవు.. కాని ప్రపోజ్‌లు వచ్చేవి అని చెప్పుకొచ్చిన భరత్ తన కన్నుకి తగిలిన గాయం గురించి కూడా వివరించాడు. హీరోగా మారేందుకు బరువు తగ్గేందుకు వ్యాయామం చేస్తున్న సమయంలో జరిగిన ప్రమాదం వల్ల తన కుడికన్ను పోయిందని చెప్పారు.
జిమ్ చేస్తున్న సమయంలో రాడ్ కు ఉన్న స్ప్రింగ్ వచ్చి కన్నుకు తగలటంతో తాను చూపును కోల్పోయినట్టు తెలిపాడు. అప్పటి నుండి కళ్లజోడు వాడుతున్నట్టు తెలిపాడు. ఇప్పటికీ ఆ ఇబ్బంది నాకు ఉంది. ఓవర్ లైట్ చూస్తే ఐ క్లోజ్ అవుతుంది. అందుకే గ్లాస్ పెట్టుకుని కాలేజ్‌కి వెళ్లేవాడిని అని చెప్పుకొచ్చాడు భరత్. హీరోగా ట్రై చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న భరత్ కెరీర్ మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నారు. ఇలా అందరినీ నవ్వించే మాస్టర్ భరత్ జీవితంలో ఇలాంటి విషాదకర ఘటన గురించి తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…