బాలనటిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన నటి శ్రీదేవి ఆ తర్వాత హీరోయిన్ గా టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ను కూడా ఏలింది. ఎంతో మంది హీరోలను స్టార్ హీరోలుగా మార్చింది. అంతేకాకుండా దర్శకులు, నిర్మాతలు సైతం శ్రీదేవి వల్ల ఎంతో ఎదిగారు. కానీ టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి మాత్రం శ్రీదేవి వల్ల నష్టపోయారు. చిరంజీవి టాలీవుడ్ లో ఎదుగుతున్న సమయంలో శ్రీదేవి కూడా అదే స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. ఆమె స్క్రీన్ పై కనిపిస్తే ఆ సినిమా సూపర్ హిట్ అన్న రేంజ్ కు శ్రీదేవి ఎదిగింది.
దాంతో నిర్మాతలు శ్రీదేవి ఇంటి ముందు క్యూ కట్టే పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో చిరంజీవి శ్రీదేవితో సినిమా చేయాలని పలువురు దర్శకులు భావించారట. కానీ శ్రీదేవి మాత్రం చిరంజీవితో నటించేందుకు పలు అభ్యంతరాలు చెప్పేదట. కొన్నిసార్లు సినిమా ఒప్పుకొని కూడా ఆ తర్వాత అనేక కారణాలు చెప్పి తప్పుకుందట. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మొదట వజ్రాల దొంగ సినిమా కథ రెడీ అయ్యింది. ఈ చిత్రానికి శ్రీదేవినే నిర్మాత కావడం విశేషం.
అయితే త్వరలో పట్టాలెక్కుతోందనుకున్న సమయంలో శ్రీదేవి ఓ షరతు పెట్టారట. చిత్రానికి తాను నిర్మాత కాబట్టి తన పాత్ర చిరంజీవి కంటే హైలెట్ ఉండాలని చెప్పింది. అయితే చిరంజీవి లాంటి స్టార్ ను తగ్గించి చూపించేందుకు దర్శకుడు ఒప్పుకోలేదు. దాంతో ఆ సినిమా ఆగిపోయింది. చిరంజీవి హీరోగా నటించిన కొండవీటి దొంగ సినిమాలో ముందుగా శ్రీదేవిని అనుకున్నారట. ఈ సినిమాలోనూ తన పాత్ర హైలెట్ గా ఉంటే నటిస్తానని శ్రీదేవి చెప్పిందట. హీరోయిన్ కు ఫైట్లు పెట్టాలని.. సినిమా పేరు కొండవీటి రాణి అని మార్చాలని ఆదేశించటంతో ఈ ప్రాజెక్ట్ నుండి శ్రీదేవినే తప్పించి హీరోయిన్లుగా రాధ, విజయశాంతిలను ఎంపిక చేశారట.
ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఆ తర్వాత శ్రీదేవినే దిగి వచ్చింది. మెగాస్టార్ తో వరుస సినిమాలు చేసింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలే జగదేక వీరుడు అతిలోక సుందరి, ఎస్పీ పరశురామ్. అలా ఇద్దరి కాంబోలో సినిమాలు రావడంతో అభిమానులు హ్యాపీ గా ఫీల్ అయ్యారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…