మిల్కీ బ్యూటీ తమన్నాకి దర్శకుడు సంపత్ నంది లైఫ్ ఇచ్చారు. అయితే శేఖర్ కమ్ముల ద్వారానే ఈ అమ్మడికి గుర్తింపు వచ్చింది. అంతకన్నా ముందే ఓ మూవీలో ఈమె హీరోయిన్‌గా నటించింది. అయితే తమన్నా హీరోయిన్‌గా అసలు పనికి రాదన్నారు. అలాంటి సమయంలోనే దర్శకుడు శేఖర్ కమ్ముల తన హ్యాపీ డేస్ మూవీలో తమన్నాకు అవకాశం కల్పించారు. అయితే ఈ మూవీలో తమన్నా చాలా ముఖ్యమైన పాత్రలో నటించింది. అందువల్ల ఈమె పాత్ర బాగా హైలైట్ అయిందని చెప్పవచ్చు. అందరికన్నా హ్యాపీ డేస్ మూవీతో తమన్నాకే ఎక్కువ పేరు వచ్చింది.
ఇక హ్యాపీ డేస్ తరువాత తమన్నా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ క్రమంలోనే దర్శకుడు సంపత్ నంది రామ్ చరణ్ హీరోగా రచ్చ మూవీని తీయగా అందులో తమన్నాకు అవకాశం దక్కింది. అయితే ఈ మూవీ ఫ్లాప్ అయినా.. తమన్నా అందాలకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఆమెకు అవకాశాలు బాగానే వచ్చాయి. రచ్చ మూవీ ఫ్లాప్ అయినా దాంతో సంబంధం లేకుండా ఈమెకు అవకాశాలు ఇచ్చారు.
అయితే తమన్నా ఎంత బాగా యాక్ట్ చేయగలదో అంతే బాగా డ్యాన్స్ కూడా చేయగలదు. ఈ క్రమంలోనే తమన్నా నటించిన పలు సినిమాలు హిట్ అయ్యాయి. ఇక ప్రస్తుతం తమన్నాకు పెద్దగా అవకాశాలు లేవు. దీంతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల వైపు అడుగులు వేసింది. ఈ మధ్య కాలంలో ఓటీటీల హవా నడుస్తోంది. కనుక వాటిల్లో తమన్నా తన అదృష్టాన్ని మళ్లీ పరీక్షించుకుంది. ఈ క్రమంలోనే ఆమె పలు షోస్, సిరీస్‌లలోనూ యాక్ట్ చేసింది.
అయితే తమన్నా చేసిన కుకింగ్ షోతోపాటు సిరీస్‌లు కూడా అంతగా ఆకట్టుకోలేదు. వాటికి పెద్దగా వ్యూస్, రేటింగ్స్ రాలేదు. దీంతో తమన్నాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. మరోవైపు చేతిలో అవకాశాలు కూడా పెద్దగా లేవు. ప్రస్తుతం ఈమె మెగాస్టార్ బోళాశంకర్ మూవీలో చేస్తోంది. ఈ మూవీ హిట్ అయితే ఒకటి రెండు అవకాశాలు వస్తాయేమోనని తమన్నా ఎదురు చూస్తోంది. అది లేకపోతే దాదాపుగా ఈ అమ్మడి కెరీర్ ముగిసినట్లుగానే భావించాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…