Chiranjeevi : త‌ప్పుడు వార్త‌లపై చాలా బాధ‌ప‌డ్డ చిరంజీవి.. ఆ వార్త‌ల వ‌ల‌న చాలా క‌ల‌త చెందాను..

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇప్ప‌టికీ కుర్ర హీరోలతో పోటీ ప‌డుతూ సినిమాలు చేస్తున్నారు. అలానే యంగ్ జ‌న‌రేష‌న్ తో పాటు త‌న స‌న్నిహితుల‌కి ఎలాంటి అవ‌స‌రం వ‌చ్చిన కూడా సపోర్ట్ అందిస్తున్నారు. తాజాగా తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని సీనియర్ సినీ పాత్రికేయుడు వినాయకరావు రచించారు. భారతీయ తొలి సినీ పత్రిక విశేషాలు, నాటి సినీ జర్నలిస్టుల నుంచి నేటి సినీ జర్నలిస్టుల వివరాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. పుస్తకావిష్కరణ సందర్భంగా చిరంజీవి ఆసక్తికర ప్రసంగం చేశారు. తన కెరీర్ ఆరంభం నుంచి సినీ పాత్రికేయులతో, రచయితలతో తనకు ఆత్మీయ అనుబంధం ఉందని చిరంజీవి అన్నారు.

ఒక్కోసారి జర్నలిస్టులు రాసే వార్తలు వాస్తవానికి దూరంగా ఉంటూ దుమారం సృష్టిస్తుంటాయని అభిప్రాయపడ్డారు. కొన్ని వార్తల కారణంగా తాను కూడా కలత చెందిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఎప్పుడో వచ్చిన ఆ వార్తల తాలూకు ప్రభావం నేటికీ వెంటాడుతూనే ఉండడం బాధాకరం అని చిరంజీవి పేర్కొన్నారు.గ‌తంలో గొల్లపూడి, జంధ్యాల, సత్యమూర్తి, సత్యానంద్ వంటి వారితో తరచుగా మాట్లాడేవాడినని, అదే అలవాటు నేటికీ ఉందని చెప్పారు. రచయితలకు, పాత్రికేయులకు తన హృదయంలో ప్రత్యేకస్థానం ఉందని అన్నారు. ‘తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర’ పుస్తక రచయిత వినాయకరావుపై చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు.

Chiranjeevi gets emotioanl talking about pawan kalyan
Chiranjeevi

ఏ పుస్తకం రాసినా కూలంకషంగా చర్చిస్తూ, లోతుల్లోకి వెళ్లి రాయడం వినాయకరావుకు అలవాటు అని తెలిపారు. అలాగే, వినాయకరావు అరుదైన ఫొటోలు సేకరిస్తుంటాడని, భావితరాలను దృష్టిలో ఉంచుకుని అతడు చేసే ప్రయత్నం అభినందనీయం అని పేర్కొన్నారు. వినాయకరావు… ఎన్టీఆర్, దాసరి, కృష్ణ గురించి పలు పుస్తకాలు రాశాడని, తన గురించి కూడా పుస్తకం రాశాడని చిరంజీవి వెల్లడించారు. ఇలాంటి వాళ్లు పుస్తకాలు రాసే ప్రయత్నాన్ని మానుకోకూడదని అన్నారు. ‘తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర’ పుస్తకాన్ని తాను కూడా కొంటున్నానని చిరంజీవి తెలిపారు. ఇక చిరు సినిమాల విష‌యానికి వ‌స్తే.. బింబిసార ఫేమ్ వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వంలో మూవీ చేయ‌నున్నాడు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago