ఆచార్య ముందు వరకు వరుస హిట్స్‌తో దూసుకుపోయాడు కొరటాల శివ. కాని ఆచార్య మాత్రం కొరటాలకి పెద్ద దెబ్బ కొట్టింది. చిరులాంటి స్టార్ హీరోకి కొరటాల ఫ్లాప్ ఇచ్చాడని ఆయనపై పలు సందర్భాలలో ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేస్తూ వచ్చారు చిరు.ఆచార్య నుండి ఇద్దరికి ఏ మాత్రం పడడం లేదని అందుకే కొరటాలని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారని అనుకున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరజీవి ఆచార్య సినిమా పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో చిరంజీవి మాట్లాడుతూ.. సినిమా విషయంలో దర్శకుడు తీసుకునే శ్రద్ధపైనే సినిమా రిజల్ట్ కూడా ఆధారపడి ఉంటుంది అని వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంఅందరు ఆచార్య పరాజయానికి కొరటాలే కారణం అంటూ కామెంట్స్ చేశారు. తాజాగా మరోసారి మెగాస్టార్ ఆచార్య పై కామెంట్స్ చేయడం ఆసక్తికరకంగా మారింది.
నేను అన్నది కేవలం కొరటాల శివని మాత్రమే కాదు. అందరి దర్శకులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించిన మాటలు అవి. అనవసరంగా కొరటాల శివకి, నాకు ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నా. స్క్రీన్ ప్లే అంతా రెడీ అయ్యాకే సెట్స్ పైకి వెళ్ళాలి. ఒక సినిమా అనుకున్న ఖర్చులో అవ్వాలి అన్నా, షూటింగ్ పూర్తి చేసుకోవాలి అన్నాకూడా .. దర్శకుడు వల్లే అది సాధ్యం అవుతుంది. పక్కా ప్రణాళిక లేకుండా 4 గంటల సినిమా తీసేసి, మళ్ళీ దానిని ముక్కలు ముక్కలుగా కట్ చేసి 2:30 గంటల సినిమా రిలీజ్ చేస్తే కుదరదు. అది మార్చుకోవాలి అంటున్నా. ఇది కేవలం నేను కొరటాల శివాని దృష్టిలో పెట్టుకొని అనడం లేదు. డైరెక్టర్ ని కెప్టెన్ అఫ్ ది షిప్ అంటాము కాబట్టి, అందర్నీ ఉద్దేశించి అంటున్నా” అంటూ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అన్ని చోట్ల ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరిస్తుంది.మొత్తానికి థియేటర్స్‌లో పూనకాలు అయితే లోడ్ అవుతున్నాయి. నిన్న విడుదలైన వీరసింహారెడ్డి కూడా మంచి విజయం సాధించగా నేడు విడుదలైన వాల్తేరు వీరయ్య కూడా పెద్ద హిట్ కావడం ఖాయం అంటున్నారు మెగా ఫ్యాన్స్.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…