Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి 30 ఏళ్లుగా డూప్‌గా చేస్తున్న వ్య‌క్తి ఎవ‌రో తెలుసా ?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎటువంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన స్వయంకృషితో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హోదాను సంపాదించుకున్నారు. 150 చిత్రాలకు పైగా నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించారు మెగాస్టార్ చిరంజీవి. నటనలో ఎంత కష్టమైన పనిని కూడా అవలీలగా చేస్తూ ఎన్నో సినిమాలలో రియల్ స్టంట్స్ చేసి ప్రేక్షకులను అలరించారు. 66 ఏళ్ల వయసులో కూడా ఇప్పటి తరం హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ను అందుకుంటున్నారు.

1978వ‌ సంవత్సరంలో పునాదిరాళ్లు చిత్రంతో తన కెరీర్ ను ప్రారంభించి ఎన్నో ఘన విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. సుప్రీం హీరో, టాప్ హీరో, మెగాస్టార్ అంటూ ఎన్నో బిరుదులు ఆయన సొంతం చేసుకున్నారు. అంత గొప్పగా ఉండేది చిరంజీవి నటన.  అప్పట్లో చిరంజీవి చిత్రాలలో ఎలాంటి కష్టమైన స్టంట్ చేయడానికి కూడా వెనుకాడేవారు కాదు. ఇప్పుడు వయస్సు రీత్యా స్టంట్స్ విషయంలో రిస్క్ తీసుకోవడం లేదు. అయితే గత 30 సంవత్సరాలుగా చిరంజీవికి ఒక వ్యక్తి డూప్ గా నటిస్తున్నారు.

Chiranjeevi dupe character playing in movies you know him
Chiranjeevi

చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ రియల్ రిస్కీ ఫైట్లతో అలరించే హీరోలు అప్పుడప్పుడూ డూప్ లతో కూడా కొన్ని సన్నివేశాలు చేయవలసిన సందర్భాలు ఏర్పడతాయి. కొన్ని రిస్క్ స్టంట్స్ చేసే టైంలో హీరోలకు ఏదైనా ప్రమాదం జరుగుతుంద‌నే భయం కారణంతో ఆ టైంలో డూప్ లతో సన్నివేశాలు చిత్రీకరిస్తారు దర్శకనిర్మాతలు. అంతటి రిస్క్ సన్నివేశాలు చేసినా కూడా అప్పటి రోజుల్లో డూప్ ల గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలిసేది కాదు.

కానీ ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చిత్ర పరిశ్రమకు సంబంధించి ప్రతి విషయాలు క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి. అంతేకాకుండా హీరోలకు నటించే డూప్ ల గురించి కూడా తెలుస్తోంది. ఇక ఇలా హీరోలకు డూప్ లుగా వ్యవహరించే వారిని కొన్ని చానెల్స్ లైవ్ లోకి తీసుకువస్తుండటంతో వారికి కూడా గుర్తింపు వస్తోంది.

అయితే ఇటీవలే ఒక షో లో చిరంజీవికి గత 30 ఏళ్లుగా డూప్ గా చేస్తున్న వ్యక్తి ఎవరు అనే విషయాలు బయటకు వచ్చాయి. ఈటీవీ లో  శ్రీదేవి డ్రామా కంపెనీ షో నిర్వాహకులు కొన్ని ప్రాంతాలకు వెళ్లి అక్కడ టాలెంట్ ఉన్న వ్యక్తులను బయటకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లాకు వెళ్లగా ఆ షోలోకి చిరంజీవికి డూప్ గా వ్యవహరించే వ్యక్తి వెలుగులోకి రావడం జరిగింది. అతని పేరు ప్రేమ్ కుమార్. ఈయన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మార్టూరుకి చెందినవాడు. ప్రేమ్ కుమార్ చిరంజీవికి 30 ఏళ్ళ నుంచి డూప్ గా పని చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ విష‌యం తెలియ‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

Share
editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago