Chiranjeevi And Rajasekhar : మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వగా ఆయన ఎంత ఎత్తు ఎదిగిన కూడా ఒదిగి ఉంటారు. అయితే అనుకోని కారణాల వలన కొన్ని సందర్భాలలో పలువురితో విబేధాలు తలెత్తుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవికి మరియు యాంగ్రీ యంగ్‌మ్యాన్ రాజశేఖర్‌కు మధ్య ఏవేవో గొడవలు ఉన్న సంగతి తెలిసిందే.అయితే చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఇవి బాగా బహిర్గతం అవ్వడం జరిగింది.గతంలో రాజశేఖర్, జీవిత దంపతులపై భీమవరంలో మెగా అభిమానులు రాళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించిన విషయం విదితమే.
అయితే ఈ గొడవలు రాజకీయ విభేదాలు కాదు, ఓ సినిమా విషయంలో వివాదాలు తలెత్తినట్టు తెలుస్తుంది. ఠాగూర్ సినిమా రాజశేఖర్, చిరు మధ్య వైరానికి తొలి బీజంగా మారింది. ఇకపోతే ఈ గొడవకు చిరుకు సంబంధం లేదు.ఇకపోతే ఆయన ప్రమేయం లేకుండానే తెరవెనక కథ నడిచింది. ఈ సినిమా నుండే రాజశేఖర్ చిరు మధ్య స్టార్ట్ కాగా, చిరు పార్టీ పెట్టినటైంకు పీక్స్ కు చేరుకున్నాయి. ఓ సందర్భంలో రాజశేఖర్ గారు చిరంజీవి రాజకీయ ప్రవేశం గురించి మాట్టాడుతూ రాజకీయాల్లో ఎందుకు పనికిరారు అన్నట్లుగా మాట్లాడారు.
ఈ మాటలకు ఆగ్రహించిన చిరంజీవి అభిమానులు.. రాజశేఖర్ తన కుటుంబంలో కారులో ప్రయాణిస్తుండగా దాడి చేసారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే స్పందించి మరుసటి రోజు ఉదయాన్నే రాజశేఖర్ ఇంటికి వెళ్లారు.అయితే అక్కడ ఆయన లేకపోవడంతో ఆయన వచ్చేవరకు ఎదురుచూసి ఆ తర్వాత ఆయనను కలిసి తన అభిమానులు ఆవేశానికి చిరంజీవి గారు మీడియా ముందు రాజశేఖర్ గారికి క్షమాపణలు చెప్పారు. క్షమాపణలు చెప్పినా ఆ గొడవ అంతటితో అయిపోయిందనుకున్న ఆ ఇష్యూ తాలూకు ఫలితాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో ఇద్దరు పరస్పరం పలకరించుకుంటున్నారు.