Roja Vs Pawan Kalyan Fans : మంత్రిగా ప్రమోషన్ అందుకున్న తర్వాతి నుండి రోజా ప్రతిపక్షాలపై దారుణమైన విమర్శలు చేస్తూ వస్తుంది.ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌తో పాటు జనసేనపైకూడా సంచలన ఆరోపణలు చేస్తూ వస్తుంది. జనసేన పేరు మార్చి కన్ఫ్యూజన్ పార్టీ అని పెట్టుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు మంత్రి రోజా. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో పవన్‌కే తెలియదన్నారు. సీఎం కాలేనని పవన్‌కి కూడా అర్థమైపోయింది కాబట్టే, చంద్రసేనకి సైనికుడిగా ఉండేందుకు తాపత్రయ పడుతున్నారని విమర్శలు కురిపించింది. ఇక లో పవన్ కళ్యాణ్ ఒక సభలో రోజాని ఉద్దేశించి డైమండ్ రాణి అంటూ సంబోధించడం జరిగింది. ఆ తర్వాత దీనిపై ఎంత దుమారం రేగిందో మనందరికీ తెలిసిందే.
అయితే రోజా కూడా పవన్ కళ్యాణ్ పై ఘాటు విమర్శలు చేసింది. కాకుండా గత కొన్ని సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఇంట్లో ఆడవాళ్ళ గురించి కూడా రోజా టార్గెట్ చేయడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవిని మరియు ఆయన బ్రదర్ నాగబాబుని టార్గెట్ చేస్తూ పోటీ చేసిన అన్ని చోట్ల కూడా వీళ్ళు ఓడిపోయారని, వీరు అసలు రాజకీయాలకి పనికిరారని మెగాస్టార్ చిరంజీవి నిజంగానే దానధర్మాలు చేసి ఉంటే ప్రజలు గెలిపించే వారే కదా అంటూ విమర్శలు చేసిన నేపథ్యంలో మెగా అభిమానుల నుంచి మరియు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా రోజాపై తీవ్రస్థాయిలో ఘాటు విమర్శలు వచ్చాయి.
![Roja Vs Pawan Kalyan Fans : మంత్రి రోజాపై పగ తీర్చుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు.. ఏం చేశారంటే..? Roja Vs Pawan Kalyan Fans what really happened](http://3.0.182.119/wp-content/uploads/2023/02/roja-vs-pawan-kalyan-fans.jpg)
మంత్రి రోజా బుధవారం విజయవాడలో జరిగిన బీఎన్‌ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆర్కే రోజాతో పాటు ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయాతే రోజా కారు దిగే సమయంలో పవన్ ఫ్యాన్స్ .. పవన్ సీఎం అంటూ గట్టిగా అరవటం మొదలుపెట్టారు. ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో ఫ్యాన్స్ గట్టిగా అరవటం మొదలుపెట్టారు. వారి అరుపుల కారణంగా రోజా కొంత ఇబ్బందిపడ్డా.. ఆమె పెద్దగా పట్టించుకోలేదు.. నవ్వి ఊరుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గామారింది. ఇంత దారుణంగా ఒక మంత్రి స్థాయి వ్యక్తి వచ్చినప్పుడు ఆమెను టార్గెట్ చేసిన విధానం చూస్తే బహిరంగంగానే అవమానం జరిగిందని చర్చించుకుంటున్నారు.