Chiranjeevi : ఈ మధ్య కాలంలో చిరంజీవి సినీ పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరితో చాలా స్నేహ పూర్వకంగా మెలుగుతున్నారు. ప్రతి ఒక్కరి టాలెంట్‌ని గుర్తిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా రాణించిన సుమన్‌కి ప్రత్యేక విషెస్ తెలియజేశారు. సుమన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 45 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా సుమన్‌కు అభినందనలు తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. మై డియర్ బ్రదర్ సుమన్.. అంటూ ఈ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా నువ్వు 45 ఏళ్లు పూర్తి చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.
10 భాషల్లో మీరు సుమారు 700 చిత్రాల్లో నటించారు. ఇది కచ్చితంగా ఒక అద్భుతమైన విజయం. ఒక వైవిధ్యమైన నటుడిగా మీకున్న నిబద్ధతకు ఇది నిదర్శనం. ఇలానే మీరు మరిన్ని సంవత్సరాలు మీరు ఒక నటుడిగా లక్షలాది ప్రేక్షకులను, మీ అభిమానులను అలరిస్తారని ఆశిస్తున్నాను. ఆ దేవుడి ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటున్నాను. మీరు సినిమా ఇండస్ట్రీలో 45 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈనెల 16న మంగళూరులో నిర్వహించే వేడుక విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. మీకు ఇవే నా శుభాకాంక్షలు. జైహింద్’’ చిరంజీవి తన వీడియో మెసేజ్‌లో వెల్లడించారు.
![Chiranjeevi : సుమన్‌కి ప్రేమతో శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి.. ఎందుకో తెలుసా..? Chiranjeevi told wishes to suman know why](http://3.0.182.119/wp-content/uploads/2023/02/suman-chiranjeevi.jpg)
అయితే సుమన్ కెరీర్‌ని చిరంజీవి తొక్కేసారని, సుమన్‌ను ఎదగనివ్వకుండా చిరంజీవి ఎన్నో కుట్రలు పన్నారని గతంలో చాలా ఆరోపణలు వచ్చాయి. అయితే, అవన్నీ వట్టి పుకార్లని సుమన్ ఇప్పటికే కొట్టిపారేశారు. తనను మోసం చేసినవాళ్లు వేరే ఉన్నారని.. తాను మోసపోవడం వెనుక తన తప్పు కూడా ఉందని సుమన్ గతంలో పలుసార్లు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు సుమన్‌కు చిరంజీవి ఎంతో ప్రమేతో శుభాకాంక్షలు చెప్పడం వారిద్దరి మధ్య విబేశాలు లేవని నిరూపించినట్టు అయింది. ‘అన్నమయ్య’ సినిమాలో శ్రీవేంకటేశ్వరుడి పాత్ర సుమన్‌కు దేశ వ్యాప్తంగా ఎంతో గుర్తింపును తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
Annayya #Chiranjeevi Congratulations Actor #Suman garu on Completing 45 Years in Films 👍
Megastar @KChiruTweets #MegaStarChiranjeevi pic.twitter.com/aC6n5hthTj— Chiranjeevi Army (@chiranjeeviarmy) February 15, 2023