Chinmayi : నిర్మాత‌ని క‌లిసిన న‌టికి సీరియ‌స్‌ వార్నింగ్ ఇచ్చిన చిన్మ‌యి

Chinmayi : సింగ‌ర్, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సమంతకి వాయిస్ ఇచ్చి మరింత పాపులర్ అయింది చిన్మ‌యి. నటుడు, దర్శకుడు రాహుల్ రామకృష్ణని పెళ్లి చేసుకున్న చిన్మయి ఇటీవలే కవల పిల్లలకి కూడా జన్మనిచ్చి వార్త‌ల‌లోకి ఎక్కింది. ఈ అమ్మ‌డు కాస్టింగ్ కౌచ్ త‌ర్వాత నిత్యం వార్త‌ల‌లో నిలుస్తుంది. ఏదో ఒక విష‌యంపై స్పందిస్తూ హాట్ టాపిక్ గా మారుతుంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఏదో ఒకదానిపై సంచలనంగా పోస్టులు చేస్తూ ఉంటుంది. అయితే త‌మిళ సినీ నిర్మాత‌, ర‌చ‌యిత వైరముత్తు పేరు చెబితేనే చిన్మ‌యి ఉప్పెనలా ఎగిసిప‌డుతుంది.

తాజాగా వైర‌ముత్తుపై సింగర్ చిన్మయి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తొలుత ఆయన మంచి వ్యక్తిగానే కనిపిస్తారని, ఆ తర్వాత అసలు స్వరూపాన్ని ప్రదర్శిస్తారని, ఇబ్బందులకు గురి చేస్తారని చెప్పుకొచ్చింది.. ఆయన గురించి తమిళ యువనటి అర్చనకు ఈ మేరకు సూచించారు. ఇటీవల వైరముత్తును అర్చన కల‌వ‌డంతో పాటు, ఆయనతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. గొప్ప రచయిత వైరముత్తును కలిశానని, ఎంతో సంతోషంగా ఉందని ఆమె తెలిపింది. ఈ నేపథ్యంలో చిన్మయి స్పందిస్తూ, ఇలాగే మొదలవుతుందని, ఆయనతో జాగ్రత్తగా ఉండాలని అర్చనకు సూచించింది.

Chinmayi given strong warning to archana
Chinmayi

వీలైనంత వరకు ఆయనకు దూరంగా ఉండాలని, నీ పక్కన వేరే వ్యక్తులు లేకుండా ఒక్కదానివే వెళ్లకు అని హెచ్చ‌రించింది.. అతనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, అతన్ని కలవకపోవడమే బెటర్ అంటూ చిన్మ‌యి స్ట‌న్నింగ్ కామెంట్స్ చేసింది. అయితే విదేశాలలో ప్రోగ్రామ్ కోసం వెళ్లినప్పుడు వైరముత్తు తనను వేధింపులకు గురి చేశాడని మీటూ వేదికగా చిన్మయి గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా, మహిళలపై జరిగే వేధింపుల విషయంలో చిన్మయి ఫైర్ బ్రాండ్ గా మారిపోయింది. మీటూ ఉద్యమంలో భాగంగా చిన్మయి తరచుగా తన గళం వినిపిస్తూనే ఉంది. మహిళలని అవమానించేలా చిన్న సంఘటన జరిగినా వెంట‌నే స్పందిస్తూ ఉంటుంది. మీటూ ఉద్యమం చెలరేగినప్పుడు చిన్మయి తమిళ లిరిసిస్ట్ వైరముత్తుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్‌గా నిలిచింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago