Chandra Babu : లోకేష్, బ్రాహ్మణిల ముద్దుల తనయుడు దేవాన్ష్ చాలా పెద్ద అయ్యాడు. ఇటీవల దేవాన్ష్ పిక్స్ పెద్దగా బయటకు రాలేదు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా తన తాత చంద్రబాబుతో కనిపించాడు. ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయడు మనవడు దేవాన్ష్ తో కలిసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ లోని తన నివాసంలోనే 77వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకున్నారు చంద్రబాబు. మనవడు దేవాన్ష్ ను తీసుకుని ఇంట్లోంచి బయటకు వచ్చిన చంద్రబాబు మొదట జాతిపిత గాంధీజీ ఫోటో వద్ద కొబ్బరికాయ కొట్టి పుష్పాంజలి ఘటించారు.
దేవాన్ష్ కూడా జాతిపితకు దండం పెట్టుకున్నాడు. అనంతరం చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుని సిబ్బందికి మిఠాయిలు పంచిపెట్టారు. అయితే డాగ్ ని పట్టుకోమని దేవాన్స్‌కి చంద్రబాబు సూచించిన కూడా చాలా భయపడ్డాడు. డాగ్ బెల్ట్ మాత్రమే పట్టుకొని ఫొటోలకి పోజులిచ్చాడు. దేవాన్ష్ ఇంత భయపడుతుండగా, నెటిజన్స్ దానిపై ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. చంద్రబాబు వారసత్వంతో ముందు సాగాల్సిన నువ్వు ఇలా భయపడితే ఎలా అని అంటున్నారు. కృష్ణా జిల్లా కొమరవోలులో ఎన్టీఆర్ గృహకల్ప పథకం కింద నిర్మించిన కాలనీకి నారా దేవాన్ష్ పేరు పెట్టిన విషయం తెలిసిందే . ప్రభుత్వం అధికారికంగా ఈ పేరు పెట్టకపోయినా, స్థానికులు అంతా కలసి దానికి నారా దేవాన్ష్ కాలనీగా నామకరణం చేశారు.
కృష్ణా జిల్లా పామర్రు మండలం కొమరవోలు గ్రామాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భార్య నారా భువనేశ్వరి దత్తత తీసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే గతంలో చంద్రబాబు కుటుంబం ఆస్తులను నారా లోకేష్ ప్రకటించారు. ఆ లెక్కల ప్రకారం చంద్రబాబు కంటే నారా దేవాన్ష్ ఆస్తులే ఎక్కువ. దాదాపు 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నికర ఆస్తులు రూ.2.99 కోట్లు కాగా, నిండా ఐదేళ్లు కూడా లేని నారా దేవాన్ష్ పేరు మీద రూ.18.72 కోట్ల ఆస్తులు ఉన్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…