Manchu Vishnu : మా అధ్యక్షుడిగా ఉన్న మంచు విష్ణు గత కొద్ది రోజులుగా వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా కూడా ఆ సినిమాలు ప్రేక్షకులని ఏ మాత్రం అలరించడం లేదు. గత ఏడాది ‘జిన్నా’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చినవ విష్ణు… ఆ తరువాత ఇప్పటి వరకు మరో సినిమా ప్రకటించలేదు. తాజాగా ఎటువంటి హడావుడి లేకుండా ఏకంగా పాన్ ఇండియా మూవీని స్టార్ట్ చేసేశాడు విష్ణు. కృష్ణంరాజు హీరోగా తెరకెక్కిన కల్ట్ క్లాసిక్ మూవీ ‘భక్త కన్నప్ప’ చిత్రాన్ని తిరిగి తెరకెక్కించడానికి ఇప్పటి మేకర్స్ చాలామంది బాగా ట్రై చేశారు. కాని అది సాధ్యం కాలేదు. అయితే గత కొంతకాలం నుంచి మంచు విష్ణు ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు గట్టిగా చెప్పుకొచ్చాడు. దానిని నిజం చేస్తూ గ్రాండ్‌గా ఈ సినిమాని లాంచ్ చేశాడు.
కన్నప్ప అనే టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మించబోతున్నాడు. అవా ఎంటర్టైన్మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకం పై దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ టెలివిజన్ రంగంలో సూపర్ హిట్ మహాభారత సిరీస్ ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇక విష్ణుకి జోడిగా బాలీవుడ్ భామ నుపుర్ సనన్ నటిస్తుంది. స్టార్ హీరోయిన్ కృతి సనన్ సోదరే నుపుర్. బుర్రా సాయి మాధవ్, పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమాకు కథ అందించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. కన్నప్ప సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.
చిత్రానికి 150 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు వార్తలువస్తుండగా, మరి కొందరు భారీ ప్రాజెక్ట్‌గా వెయ్యి కోట్లతో సినిమాని అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా రూపొందించనున్నారని సమాచారం. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే ఈ మూవీ కోసం మరికొంతమంది స్టార్ క్యాస్ట్ అండ్ టెక్నీషియన్స్ రంగంలోకి దిగబోతున్నట్లు తెలియజేశారు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే మొదలుపెట్టి సింగల్ షెడ్యూల్ లో మొత్తం కంప్లీట్ చేస్తామని, చిత్రీకరణ మొత్తం కూడా న్యూజిలాండ్ లో జరగనుందని విష్ణు తెలియజేశాడు. తరతరాలు గుర్తు పెట్టుకునేలా భక్త కన్నప్ప సినిమాని నిర్మిస్తామని మోహన్ బాబు పేర్కొన్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా తెరకెక్కనుండగా, ఈ చిత్రం కోసం ఎవరైన నిర్మాతలు వస్తే వారిని కూడా ఆహ్వానిస్తామని విష్ణు అన్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…