Chandra Babu : చంద్ర‌బాబు చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. రంగంలోకి ఈడీ..?

Chandra Babu : ఎన్నిక‌ల‌కి ముందు చంద్ర‌బాబుకి చెక్ పెట్టేందుకు వైసీపీ గ‌ట్టిగా ప్లాన్ చేస్తుంది. ఈ క్ర‌మంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడు కు .. ఆదాయ‌ప‌న్ను శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ కంపెనీల నుంచి చంద్ర‌బాబు నాయుడుకు సుమారు 118 కోట్లు ముడుపుల రూపంలో ముట్టిన‌ట్లు ఐటీ శాఖ ఆరోపించింది. చ‌ట్టం ప్ర‌కారం ఆ సొమ్ము అప్ర‌క‌టిత ఆదాయంగా పేర్కొన్న‌ది. బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా చంద్రబాబు ముడుపులు పొందినట్లు ఆదాయ పన్ను శాఖ అధికారులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఈ కేసులో చంద్రబాబు అభ్యంతరాలను తిరస్కరించిన తర్వాత.. ఆగష్టు 4వ తేదీనే హైదరాబాద్‌ ఐటీ సెంట్రల్‌ సర్కిల్‌ కార్యాలయం సెక్షన్ 153C కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

షాపూర్జి పల్లోంజి (ఎస్ పి సి ఎల్), ఎల్ అండ్ టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా ముడుపులు ముట్టినట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఫోనిక్స్ ఇన్ఫ్రా& పౌర్ ట్రేడింగ్ అనే సబ్ కాంట్రాక్టు సంస్థ ద్వారా నగదు మళ్లింపు జరిగినట్లు తేలింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని బోగస్ సబ్-కాంట్రాక్టర్ల ద్వారా ఆదాయం సృష్టించి చివరికి అదంతా చంద్రబాబుకు చేరిందని తాజా ఆరోపణ సారాంశం. 2017లో షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీ తరపున కొన్ని ప్రాజెక్టులకు టెండర్ ప్రక్రియలో మనోజ్ వాసుదేవ్ పరద సామి అనే వ్యక్తి పాల్గొన్నారు. 2019లో పరదసామి కార్యాలయాలు, నివాసాల్లో ఐటీ శాఖ సోదాలు చేసింది. అప్పుడు కొన్ని బోగస్ కాంట్రాక్టుల గుట్టు విప్పారని ప్రచారం జరుగుతోంది. షాపూర్‌జీకి వచ్చిన పనులను సబ్-కాంట్రాక్ట్‌కి ఎలా ఇచ్చారు.. ఆ నిధులు ఎక్కడికి చేరాయో ఒప్పకున్నారని వార్తలు వచ్చాయి.

Chandra Babu might get notice from ed
Chandra Babu

అవినీతికి ప్యాంట్ షర్ట్ వేస్తే చంద్రబాబు లాగా ఉంటుంద‌ని వైసీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే చంద్ర‌బాబు చుట్టూ రోజురోజుకి పట్టు బిగిస్తున్న‌ట్టుగా తెలుస్తుంది. ఆయ‌న‌ని విచారించేందుకు ఈడీ కూడా రంగంలోకి దిగుతున్న‌ట్టు స‌మాచారం. చంద్ర‌బాబుని ఈడీ విచారించి అనేక విష‌యాల‌ని బ‌య‌ట‌కు లాగ‌నున్న‌ట్టు స‌మాచారం. అయితే వీటిపై చంద్ర‌బాబు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago