Chandra Babu : కేంద్రంలో చ‌క్రం తిప్పుతున్న చంద్ర‌బాబు.. ఏపీకి ఇప్పుడైనా ప్ర‌త్యేక హోదా తెస్తారా..? ఇదే చాన్స్ మ‌రి..!

Chandra Babu : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో ఫ్రత్యేక హోదా అంశం మరోసారి హ‌ట్ టాపిక్‌గా మారింది. కొన్నాళ్లుగా ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు డిమాండ్ చేస్తుండ‌గా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా చంద్ర‌బాబు, నితీష్ మారడంతో ఈ అంశం ఆసక్తిగా మారింది. కేంద్రంలో బీజేపీ 240 స్థానాలే సాధించి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితిలో, తెలుగు దేశం పార్టీ (16 ఎంపీ సీట్లు ), జేడీ (యూ) (12 ఎంపీ సీట్లు) మద్దతు ఆ పార్టీకి అనివార్యంగా మారింది. ఈ క్ర‌మంలో చంద్రబాబు మరోసారి కేంద్రంలో కింగ్ మేకర్ అయ్యారు. అత‌నికి క‌న్వీన‌ర్ ప‌దవి ఇచ్చే అవ‌కాశం కూడా ఉంద‌ని టాక్.

2014 లో కేంద్రంలో యూపీఏ కూటమి ఓటమి పాలై ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చింది. అదే సమయంలో ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగా.. ఆ తర్వాత 2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోయాయి. కేంద్రంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని దాదాపుగా తేల్చేసింది. అయితే అప్పుడు సొంతంగా బీజేపీకి మెజార్టీ ఉండటంతో వారు ఏది చెప్పిన చెల్లింది. కాని ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉండ‌డంతో ఏపీకి ప్రత్యేక హోదా సాధించే అవకాశం చంద్రబాబు నాయుడుకు దక్కింది.

Chandra Babu has power this time will he bring special status to ap
Chandra Babu

పేదరికం, ఆర్థికంగా వెనుకబడడం అనే కారణాలతో తమకు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని ఎప్పటి నుంచోఏపీ, బీహార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారాన్ని ఏర్పాటు చేయాలన్నా.. నరేంద్ర మోదీ.. మరోసారి ప్రధానమంత్రి కావాలన్నా కూడా.. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ.. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీలకు సంబంధించిన ఎంపీలే కీలకం కాబోతున్నారు. అయితే ఇప్పుడు మోదీకి సపోర్ట్ చేయాలంటే.. ఏపీ, బీహార్‌లు తమకు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌ను కేంద్రం ముందు ఉంచే అవ‌కాశాలు లేక‌పోలేదు. మ‌రి ఈ సారైన ఏపీకి ప్ర‌త్యేక హోదా వ‌స్తే అంత‌కి మించిన ఆనందం మ‌రొక‌టి ఉండ‌దు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

6 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago