Chandra Babu : ప‌క్కా స్కెచ్‌తోనే చంద్ర‌బాబు అరెస్ట్..? వెలుగులోకి సంచ‌ల‌న విష‌యాలు..?

Chandra Babu : ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేయ‌డంతో ఇప్పుడు ఏపీ ర‌ణ‌రంగంగా మారింది. నంద్యాలలో ఉన్న చంద్రబాబు బస చేసిన క్యాంపు వద్దకు పోలీసులు అర్ద్రరాత్రి తరువాత చేరుకున్నారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున గందరగోళం చోటు చేసుకుంది. తనను అరెస్ట్ చేసేందుకు కారణాలు ఏంటో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. దీంతో అరెస్ట్ కు సంబంధించిన పేపర్లను..వివరాలను అందించిన పోలీసులు చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు కూడా వెల్లువెత్తుతున్నాయి. సరైన నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడం సరికాదన్న పురంధీశ్వ‌రి… FIRలో పేరు లేకుండా, ఎలాంటి వివరణా తీసుకోకుండా ఏ విధంగా అరెస్టు చేస్తారని ఆమె ప్రశ్నించారు. ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం సమర్ధనీయం కాదు అన్నారు.

చంద్రబాబు అరెస్ట్ వార్తలతో శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా కలకలం రేగింది. చంద్రబాబును అరెస్ట్ చేసి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు తీసుకువెళ్ళాలని పోలీసులు యత్నిస్తున్నారు. అక్కడ హెలికాప్టర్‌ను పోలీసులు సిద్ధంగా ఉంచారు. అక్కడి నుంచి విజయవాడకి తరలించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసు ఫైళ్ళను పోలీసులు నంద్యాల తీసుకువెళ్లారు. ఇటీవల స్కిల్ డెవలప్మెంట్ కేసులో కొంతమందికి కోర్టు ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది. ఇదే కేసులో ఒక ఆడిటర్‌ను సీఐడీ అధికారులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో ఏదైనా స్టేట్‌మెంట్ ఇపపించారేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Chandra Babu arrest important facts coming to know
Chandra Babu

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్‌లో రూ.241 కోట్లు అవినీతి జరిగిందనే అభియోగాలతో.. ఏపీ సీఐడీ పోలీసులు ఇవాళ ఉదయం 5 గంటలకు చంద్రబాబు నాయుడిని నంద్యాలలో అరెస్టు చేశారు. వైద్య పరీక్షల తర్వాత చంద్రబాబు అరెస్టు పేపర్లపై సంతకం పెట్టారు. ఈ కేసులో సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కింద చంద్రబాబును అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ఉన్నారు. చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్‌ 34 and 37 ఐపీసీ సెక్షన్‌ల కింద కేసు నమోదైంది. ప‌క్కా స్కెచ్‌తోనే చంద్ర‌బాబు అరెస్ట్ జ‌రిగింద‌ని అంటున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

35 mins ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

20 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago