వ‌డ్డీ లేకుండా మ‌హిళ‌ల‌కు రుణం.. కేంద్ర ప్ర‌భుత్వం బంప‌ర్ ఆఫ‌ర్..!

కేంద్ర ప్ర‌భుత్వం ఎప్ప‌టికప్పుడు కొత్త ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల‌ని సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కి గురి చేస్తుంది. రీసెంట్‌గా మహిళల కొరకు కొత్త పథకాన్ని తీసుకువచ్చి శుభవార్త చెప్పింది. మహిళలు 3 లక్షల రూపాయల వరకు రుణం తీసుకుని, 88 రకాల చిన్న వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం “ఉద్యోగిని. అవసరమైన అర్హతా ప్రమాణాలున్న దరఖాస్తుదారులు ఈ పథకం కింద రూ. 3 లక్షల వరకు రుణం పొందవచ్చు. అలాగే.. వైక‌ల్య‌మున్న మ‌హిళ‌లు, వితంతువులకు రుణ ప‌రిమితి లేదు. వారు నెల‌కొల్పే వ్యాపారం, వారి అర్హ‌త‌ల‌ను బ‌ట్టి ఇంకా ఎక్కువ రుణం పొందవచ్చు.

కేంద్ర ప్ర‌భుత్వం ఆత్మ‌నిర్భ‌ర్ కార్యక్రమ లక్ష్యాల్లో మ‌హిళ‌లకు ఆర్థిక స్వావ‌లంబన కోసం ఆర్థిక స‌హాయం అందించడమూ కూడా ఒకటి. మ‌హిళ‌లు పారిశ్రామిక‌వేత్త‌లుగా, వ్యాపార‌వేత్త‌లుగా ఎదిగి త‌మ‌ కాళ్ల‌పై తాము నిల‌దొక్కుకోవ‌డానికి ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కమే ఈ ఉద్యోగిని. ఈ పథకాన్ని మొద‌ట కర్ణాటక ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టినప్ప‌టికీ.. త‌రువాత కేంద్ర ప్ర‌భుత్వం దీన్ని వుమెన్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో దేశ‌మంత‌టా అమ‌లు చేస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ ప‌థ‌కం ద్వారా 48 వేల మంది మ‌హిళ‌లు ల‌బ్ధి పొంది చిన్నపాటి పారిశ్రామిక‌వేత్త‌లుగా రాణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

center giving loans to woman

వికలాంగులు, వితంతువులు మరియు దళిత మహిళలకు పూర్తిగా వడ్డీ లేని రుణాలను అందిస్తుండగా, వివిధ వర్గాల మహిళలకు 10 శాతం నుండి 12 శాతం వరకు వడ్డీ రేటుతో రుణాలు మంజూరు చేస్తారు. పొందిన రుణాల్లో కుటుంబ వార్షిక ఆదాయాల ఆధారంగా 30 శాతం వరకు సబ్సిడీ మంజూరు చేస్తున్నారు. ఏదైనా మునుపటి రుణాలు సక్రమంగా తిరిగి చెల్లించబడని సందర్భంలో, వ్యక్తులు తదుపరి రుణాలను స్వీకరించడానికి అర్హులు కారు. 18 నుండి 55 సంవత్సరాల వయస్సులోపు ఉన్న ఏ మహిళా వ్యక్తి అయినా పాల్గొనడానికి అర్హులుగా పరిగణించబడతారు. ఈ పథకం కోసం మహిళా దరఖాస్తుదారులు తమ క్రెడిట్ స్కోర్ మంచి స్థితిలో ఉండేలా చూసుకోవడం చాలా అవసరం.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

15 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

5 days ago