Byreddy Siddharth Reddy : ఏపీలో రోజు రోజుకి రాజకీయం వేడెక్కిపోతుంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో రాజకీయం మరింత రంజుగా మారింది. చంద్రబాబు ప్రస్తుతం వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ప్రత్యేక వీడియో విడుదల చేసి చంద్రబాబు, నారా లోకేష్‌లతో పాటు పవన్ కళ్యాణ్‌లకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు ఏనాడైన పోతిరెడ్డి పాడు వైపు చూశావా అంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఎన్ని పర్యటనలు చేసినా ఆయనని పట్టించుకునే వారే లేరని.. అందుకే కాంట్రవర్సీ గా మాట్లాడుతున్నారని అన్నారు.
వాలంటీర్లు 5000 రూపాయల గౌరవ వేతనం తీసుకొని సేవలు చేస్తున్నారని.. వాళ్ల వల్ల డేటా చౌర్యం జరుగుతుందన్నడం సరికాదన్నారు.గతంలో జన్మభూమి కమిటీలు చేసిన పనులను ఎవరు ప్రశ్నించలేదని అన్నారు. ఏపీలో కుళ్ళి కుషించిపోయిన టిడిపి పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ వెంపర్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఏపీలో పవన్ కళ్యాణ్ కి ఓటు వేయాలని ఎవరు అనుకోవడం లేదని ఆయన అన్నారు. ఇక లోకేష్ ముందు మంగళగిరి సంగతి చూసుకోవాలని సూచించారు. సీఎం జగన్ ఏపీలో పథకాలు ఎలా అమలు చేస్తున్నారో ప్రజలను అడిగి తెలుసుకోండని చురకలంటించారు.
అయితే వైసీపీ యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి పరోక్షంగా చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. నందికొట్కూరు ఎమ్మెల్యేను కూడా లెక్క చేయని ఓ వైసీపీ నాయకుడు విర్ర వీగుతున్నాడని అన్నారు. రౌడీయిజం చేస్తే ఖబడ్దార్..మాటలు మాట్లాడటం కాదు, అభివృద్ధి, సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. రౌడీయిజం చేస్తే తాట తీస్తా అని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. ఇలా ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటూ రాజకీయం మరింత రంజుగా మారేలా చేస్తున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…