Bumrah Sunil Narine Wicket : ప్రస్తుతం ఐపీఎల్ చాలా రసవత్తరంగా మారుతుంది. బ్యాటర్స్.. బౌలర్స్‌ని టార్గెట్ చేసుకొని ఎడాపెడా బాదేస్తున్నారు. అయితే కొందరు బౌలర్స్ మాత్రం ఏ బ్యాట్స్‌మెన్ అయిన సరే తమ ట్రేడ్ మార్క్ బౌలింగ్‌తో వణుకు పుట్టిస్తున్నారు. వారిలో బుమ్రా ఒకరు.ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ప్రతి మ్యాచ్‌లోను కళ్లు చెదిరే బౌలింగ్‌తో ఔరా అనిపిస్తున్నాడు. గతరాత్రి జరిగిన మ్యాచ్‌లో స్టన్నింగ్ డెలివరీతో కేకేఆర్ విధ్వంసకర బ్యాటర్ సునీల్ నరైన్‌ను గోల్డెన్ డక్ చేశాడు. బుమ్రా అసాధారణ బంతికి సునీల్ నరైన్ బిత్తరపోయాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కేకేఆర్, ముంబై ఇండియన్స్ మధ్య ఈడెన్స్ గార్డెన్స్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
బుమ్రా వేసిన రెండో ఓవర్ తొలి బంతికే నరైన్ క్లీన్ బౌల్డ్‌గా పెవిలియన్ చేరాడు. ఈ బంతిని అంచనా వేయడంలో సునీల్ నరైన్ విఫలమయ్యాడు. బౌన్సర్ వేస్తాడని ఊహించిన అతను బంతిని వదిలేయగా.. బుమ్రా అప్పటికప్పుడు ప్లాన్ మార్చేసి ఇన్ స్వింగర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో సునీల్ నరైన్(0) నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. . బూమ్ బూమ్ బుమ్రా అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు..వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్ మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. దాంతో ఓవర్లను 16కు కుదించి అంపైర్లు ఆటను కొనసాగించారు. వెంకటేశ్ అయ్యర్(21 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42), నితీష్ రాణా(23 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 33) దూకుడుగా ఆడారు.
కేకేఆర్ 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. వెంకటేశ్ అయ్యర్ ధాటిగా ఆడగా.. అయ్యర్ ఆచితూచి ఆడాడు. అయితే అయ్యర్(7)ను అన్షుల్ కంబోజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో పవర్ ప్లేలో కేకేఆర్ 3 వికెట్లకు 45 పరుగులే చేసింది. నితీష్ రాణాతో కలిసి వెంకటేశ్ అయ్యర్ చెలరేగాడు. దూకుడుగా ఆడిన ఈ ఇద్దరూ.. నాలుగో వికెట్‌కు 37 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. బుమ్రా వేసిన ఆఖరి ఓవర్‌లో రింకూ సింగ్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి మిచెల్ స్టార్క్ రాగా.. రమణ్‌దీప్ సింగ్ ఆఖరి బంతికి సిక్సర్ బాది జట్టు స్కోర్‌ను 157 ధాటించాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…