Brown Rice : ప్రస్తుత తరుణంలో చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందుకు కారణం ప్రధానంగా ఆహారపు అలవాట్లే అని చెప్పవచ్చు. ముఖ్యంగా చాలా మంది తెల్ల అన్నం తింటున్నారు. దీంతో అనేక రోగాలు వస్తున్నాయి. కానీ దానికి బదులుగా బ్రౌన్ రైస్‌ను తినడం అలవాటు చేసుకోవాలి. దీంతో ఎన్నో లాభాలను పొందవచ్చు. బ్రౌన్ రైస్.. ముడి బియ్యం.. దీన్ని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. అన్నం తెల్లగా మల్లె పువ్వులా ఉంటేనే చాలా మంది తింటారు. నిజానికి తెల్ల బియ్యం కన్నా ముడి బియ్యమే ఆరోగ్యకరమైనవి. బ్రౌన్ రైస్‌ను తినడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రౌన్ రైస్‌లో ఫైబర్, పోషకాలు అధికంగా ఉంటాయి. కనుక వీటితో వండిన అన్నాన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. దీని వల్ల డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. డయాబెటిస్ సమస్య ఉన్నవారికి బ్రౌన్ రైస్ మంచి ఆహారం అని చెప్పవచ్చు. అధిక బరువుతో బాధపడేవారు రోజూ రెండు పూటలా బ్రౌన్ రైస్‌ను తినాలి. దీంతో బరువును తగ్గించుకోవచ్చు. శరీరంలో ఉండే కొవ్వు మొత్తం కరుగుతుంది. అలాగే పాలిచ్చే తల్లులు బ్రౌన్ రైస్‌ను తినడం వల్ల వారిలో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది.
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే బ్రౌన్ రైస్‌ను రోజూ తినాలి. దీంట్లో ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ తగ్గుతుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్‌లు వచ్చే ముప్పు తగ్గుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే బ్రౌన్ రైస్‌ను తినడం వల్ల నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు చురుగ్గా మారుతుంది. ఉత్సాహంగా ఉంటారు. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. ఇక బ్రౌన్ రైస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కనుక రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మతిమరుపు సమస్య తగ్గుతుంది. జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు. ఈ రైస్‌ను తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. డిప్రెషన్ తగ్గుతుంది. ఇలా అనేక లాభాలు ఉంటాయి కనుక బ్రౌన్ రైస్‌ను ఎవరైనా సరే తప్పక తినాల్సిందే.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…