Bro Movie Collections : కొందరికి కటౌట్ ఉన్నా కంటెంట్ లేకపోతే సినిమాలు బోల్తా పడ్డట్టే. కాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి అలా కాదు. కంటెంట్ అటు ఇటు ఉన్నా కూడా పవన్ కటౌట్‌కి పిచ్చ కలెక్షన్స్ వస్తుంటాయి. పవన్ తాజాగా బ్రో అనే సినిమతో ప్రేక్షకులని పలకరించాడు. ఈ సినిమా చుట్టూ రాజకీయం, అనేక విమర్శలు, వివాదాలు చుట్టు ముట్టాయి అయిన కూడా ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరి అందరిని ఆశ్చర్యపరచింది.సోమవారం నాటి కలెక్షన్స్‌తో వరల్డ్ వైడ్‌గా 102 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే రోజు రోజుకు బ్రో మూవీ వసూళ్లు మాత్రం భారీగా తగ్గుముఖం పడుతోన్నాయి. రిలీజ్ రోజు వరల్డ్ వైడ్‌గా 30 కోట్లకుపైగా షేర్‌ను రాబట్టిన ఈ మూవీ సోమవారం రోజు కేవలం రెండు కోట్ల యాభై లక్షల కలెక్షన్స్ మాత్రం సొంతం చేసుకున్నది.
‘బ్రో చిత్రానికి ఆంధ్రా, తెలంగాణలో 5వ రోజూ డౌన్ అయిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 72 లక్షలు, సీడెడ్‌లో రూ. 25 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 24 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 11 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, గుంటూరులో రూ. 9 లక్షలు, కృష్ణాలో రూ. 12 లక్షలు, నెల్లూరులో రూ. 7 లక్షలతో కలిపి.. రూ. 1.68 కోట్లు షేర్, రూ. 3.00 కోట్లు గ్రాస్ వచ్చింది. డివోషనల్ సబ్జెక్టుతో వచ్చిన ‘బ్రో మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 98.50 కోట్లుగా ఫిక్స్ చేయగా, . ఇక, 5 రోజుల్లో దీనికి రూ. 60.42 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 38.08 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.
వరల్డ్ వైడ్‌గా ఐదు రోజుల్లో 102 కోట్ల గ్రాస్, 60 కోట్ల వరకు షేర్ వసూళ్లు బ్రో సినిమాకు వచ్చాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి నిర్మాతలు, ఎగ్జిబిటర్లు లాభాల బాట పట్టాలంటే ఇంకో 38 కోట్ల వరకు కలెక్షన్స్ రావాలని ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. పవన్ కళ్యాణ్ గత సినిమాలు వకీల్‌సాబ్, భీమ్లానాయక్ కూడా వంద కోట్ల వసూళ్లను సాధించాయి. వరుసగా మూడు సినిమాలతో ఈ ఘనతను సాధించిన టాలీవుడ్ హీరోల్లో ఒకరిగా బ్రో మూవీతో పవన్ కళ్యాణ్ రికార్డ్ క్రియేట్ చేశాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…