Anand Deverakonda : మెగాస్టార్ చిరంజీవికి చిన్న పిల్లాడి నుండి పండు ముసలి వరకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఆయన డ్యాన్స్‌లకి, ఫైట్స్ కి ,నటనకి ఫిదా కాని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఏడు పదులకి దగ్గర అవుతున్నా కూడా వరుస సినిమాలు చేస్తూ అందరిని అలరిస్తూ ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. 70, 80, 90ల దశకంలోని అందరికీ చిరంజీవి అభిమాన హీరో. ఇప్పుడు కూడా చాలా మంది ఆయన అభిమానులుగా ఉన్నారు. రీసెంట్‌గా జరిగిన బేబి కల్ట్ సెలబ్రేషన్స్ లో ఎస్ కే ఎన్, సాయి రాజేష్‌లు స్వతాహాగా చిరు అభిమానులు. చిరు మీదున్న ప్రేమతోనే చదువు సంధ్యలు వదిలేసి హైద్రాబాద్‌కు వచ్చారని చెప్పుకొచ్చారు.
ఇక ఆ కార్యక్రమానికి ఆనంద్ దేవరకొండ పేరెంట్స్ కూడా వచ్చారు. ఇక స్టేజ్ మీద ఆనంద్ దేవరకొండ, ఆయన తల్లి మాధవి, తండ్రి గోవర్దన రావు కూడా నిల్చున్నారు. విజయ్ దేవరకొండ తండ్రి చిరంజీవితో ఏదో ముచ్చటిస్తున్నాడు. అటు పక్కన విజయ్ తల్లి మాధవ్ నిల్చుంది. అయితే చిరంజీవి పక్కన నిల్చోవడం మాత్రమే కాదు.. చిరు చేయి పట్టుకుంది.. అది గమనించిన చిరు.. కాస్త దగ్గరకు వచ్చి.. ప్రేమగా ఆమె చేతిని పట్టుకున్నాడు.. ఇక దీంతో విజయ్ తల్లి మరింతగా మురిసిపోయింది.. ఆ తరువాత ఫోటోలకు పోజులు ఇచ్చే టైంలోనూ మాధవి చిరు చేతిని వదలకుండా చాలా ఎమోషల్ అయింది.
ఎంత ఏజ్ వాళ్లైనా సరే చిరంజీవికి అభిమానులే.. చిరుని చూస్తే చాలు, ఓ ఫోటో దిగితే చాలు అని అనుకుంటారు అంటూ మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. చిరు పక్కన నిలబడటంతో విజయ్ తల్లి ఆనందం కంట్లో కనిపిస్తోందంటూ కామెంట్లు కనిపిస్తున్నాయి. ఇక ఆనంద్ దేవరకొండ అయితే చిన్నతనంలో చిరంజీవి సినిమాకు తీసుకెళ్లమని ఏడ్చేవాడట. స్క్రీన్ మీద చిరంజీవిని చూస్తే ఇలా బతకాలి కదా? అని అనుకునేవాడట. అలాంటి చిరంజీవి తన సినిమా కోసం వచ్చి.. తమ టీంను ఎంకరేజ్ చేస్తుండటంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. నటుడికి ఇంత కంటే ఏం కావాలంటూ చాలా ఉద్వేగానికి లోనయ్యాడు ఆనంద్.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…