Boyapati Srinu : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ రాజకీయాలు ఎంతగా మారాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీతోపాటు ఇతర రాజకీయ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు కూడా చంద్రబాబును అరెస్టును ఖండించారు. అయితే, నందమూరి కుటుంబంలో కీలక సభ్యుడైన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ స్పందించకపోవడంపై ఇటీవల నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ.. కొందరు స్పందించకుంటే ఏంటీ? డోంట్ కేర్ అంటూ వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్ గతంలో టీడీపీ తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్ పై ఎన్టీఆర్ స్పందించకపోవడంపై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. మరికొంతమంది ఎన్టీఆర్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ ఎందుకు స్పందించట్లేదు అనే దానిపై కూడా పలువురు వ్యాఖ్యానించారు. తనని వాడుకొని వదిలేసినప్పుడు అసలు ఎందుకు స్పందించాలని కొందరు అంటుంటే, మరి కొందరు మాత్రం ఆయన సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండడం వలన స్పందించలేకపోయారని అన్నారు. అయితే తాజాగా బోయపాటి శీను ఇన్‌డైరెక్ట్‌గా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
చంద్రబాబు పోరాటంకి సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవదాలు తెలిపిన బోయపాటి శీను ఐటీ ప్రోఫెషనల్స్, సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వారికి మార్గదర్శకుడిగా ఉన్న చంద్రబాబు మేలు మరచిపోకుండా ఆయనకి అండగా ఉన్నదందుకు ధన్యవాదాలు అని బోయపాటి అన్నారు. మానవత్వం, మంచితనం, విశ్వాసం చూపించిన వారికి తప్పక కృతజ్ఞతలు తెలియజేయాలి. వారే అంతచేసినప్పుడు వారికి దగ్గరగా ఉండి మాలాంటి వాళ్లు స్పందించకపోతే మనిషే కాదు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని బోయపాటి అన్నారు. అయితే ఆయన ఎన్టీఆర్‌ని ఇన్‌డైరెక్ట్‌గా విమర్శించాడు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…