Bigg Boss 7 : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్యక్రమం తెలుగులో సక్సెస్ ఫుల్‌గా ఆరు సీజన్స్ జరుపుకుంది. సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ కావడంతో.. సీజన్ 7 గురించి ఊసేలేకుండా పోయింది. అయితే ఈసారి పక్కా వ్యూహంతో సీజన్ 7ని ఎలాగైనా సక్సెస్ బాట పట్టించాలని నిర్వాహకులు ప్లాన్స్ చేస్తున్నారు. అందుకే ఈ సారి కొంత ఆలస్యంగానే సీజన్ 7 ప్రారంభం కాబోతుందని టాక్. అయితే సీజన్ 7 ఎప్పటి మాదిరిగానే ఉంటుందా? హోస్ట్ నాగార్జుననే ఉంటారా, కొత్త కంటెస్టెంట్స్ ఎవరు ఇలా అనేక విషయాలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
బిగ్ బాస్ తెలుగు గమనిస్తే.. ఒకటవ సీజన్ కి హోస్టుగా ఎన్టీఆర్, రెండవ సీజన్ కి హోస్టుగా నాని , మూడవ సీజన్ నుంచి ఆరవ సీజన్ వరకు నాగార్జున హోస్ట్ గా చేశారు.అయితే రెండు మూడు సీజన్స్ పెద్దగా అలరించలేకపోవడం, బిగ్ బాస్ కి లీక్ ల బెడద వస్తున్న నేపథ్యంలో పక్కా పగడ్బందీ తో షో నీ ప్లాన్ చేయబోతున్నారు నిర్వాహకులు. ఇకపోతే ఈసారి ఊహించని విధంగా బిగ్ బాస్ హౌస్ లో కిక్ ఇచ్చే చేంజెస్ జరగనున్నట్లు తెలుస్తోంది. హోస్ట్‌గా నాగార్జున స్థానంలో బాలకృష్ణని తీసుకురాబోతున్నారని, వివాదాస్పద వ్యక్తులను, విడాకులు తీసుకున్న పాపులర్ జంటలను కంటెస్టెంట్లుగా తీసుకురాబోతున్నారని టాక్.
అమర్ దీప్ అతని భార్య, యాంకర్ దీపికా పిల్లి, యూట్యూబర్ నిఖిల, నటి ఐశ్వర్య, సింగర్ హేమ చంద్ర, డ్యాన్సర్ శ్వేత నాయుడు, నటి మిత్రా శర్మ, నటి శోభ శెట్టి, ట్రాన్స్‌జెండర్ తన్మయి, మోడల్ సాయి రోనక్, న్యూస్ రీడర్ ప్రత్యూష, సింగర్ మోహన భోగరాజు, యాంకర్ రష్మీ, కమెడీయన్ రష్మీ, సింగర్ మంగ్లీ, కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ ఇలా పలువురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ 7లో పాల్గొనబోతున్నారని సమాచారం. ఈసారి మంచి టిఆర్పి రేటింగ్ కొట్టడానికి భారీగా ప్లాన్లు చేస్తున్నట్లు సమాచారం. మరి ఈసారి సీజన్ సెవెన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…