Manoj Bajpayee : బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయి తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. అల్లు అర్జున్ నటించిన హ్యాపీ సినిమాలో డీసీపీ గా నటించి మెప్పించారు మనోజ్. అలాగే వేదం సినిమాలో అద్భుతమైన పాత్రలో కనిపించి మెప్పించారు. హ్యాపీ కంటే ముందు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సుమంత్ నటించిన ప్రేమకథ సినిమాలో హీరోయిన్ అన్న పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు మనోజ్. పవన్ కళ్యాణ్ నటించిన కొమురం పులి సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించి అలరించారు.
ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో ఆయన తెలుగు సినిమాల్లో నటించలేదు. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇక రీసెంట్ గా ఫ్యామిలీ మెన్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది ప్రేక్షకులని ఎంతగానో ఆకర్షించింది. ఇక సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై సినిమా జీ5 ఓటీటలో అద్బుతమైన రెస్పాన్స్‌ను కూడగట్టుకొంటున్నది. ఈ క్రమంలో మనోజ్ బాజ్ పాయ్ ఓ సందర్భంలో ప్రస్తావస్తూ పుష్ప2లో తాను చేయబోతున్నట్టు వచ్చిన వార్తలపై స్పందించాడు. పుష్ప 2 సినిమాలో తాను నటిస్తున్నట్టు ఓ వార్తను నేను కూడా విన్నాను. కానీ అది నిజం కాదు. గతంలో నేను అల్లు అర్జున్‌తో హ్యాపీ చిత్రంలో నటించాను. అతడితో నటించడం గొప్ప అనుభూతి.
కొన్ని సినిమాలు తెలుగులో చేసిన తర్వాత మళ్లీ చేయలేదు. అల్లు అర్జున్‌తో ప్రస్తుతం టచ్‌లో లేను.ఇక ముందు ఏదైనా ఛాన్స్, మంచి ఆఫర్ వస్తే తప్పకుండా నేను తెలుగులో నటించడానికి నేను సిద్దం అని మనోజ్ బాజ్‌పేయ్ చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో లాయర్ గా నటించగా.. మహేష్ బాబుకు ఈ పాత్ర చాలా బాగా సూట్ అవుతుంది అని మనోజ్ బాజ్‌పాయ్ అన్నారు. మహేష్ ఆ పాత్రలో నటిస్తే బాగుంటుంది అని అన్నారు. దాంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…