Bigg Boss 6 : బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని షో బిగ్ బాస్. విదేశాలలో ప్రారంభమైన ఈ షో మొదట హిందీలో అడుగుపెట్టి ఆ తర్వాత అన్ని సౌత్ భాషలకు పాకింది. తెలుగులో ఈ షో నాన్ స్టాప్‌గా దూసుకుపోతుంది. ఎన్టీఆర్ హోస్ట్ గా 2017లో మొదలైన బిగ్ బాస్ షో అనేక రికార్డ్స్ నమోదు చేసింది. దీంతో మిగతా సీజన్స్ కొనసాగించారు. రెండో సీజన్‌కి నాని హోస్ట్‌గా వ్యవహరించగా, తర్వాతి సీజన్స్‌కి నాగార్జున సారథ్యం వహించారు. అయితే అన్ని సీజన్స్‌లోనూ బిగ్ బాస్ తెలుగు 4 లాంచింగ్ ఎపిసోడ్ 18.8 టీఆర్పీ రాబట్టింది. అయితే ఈ సీజన్ మాత్రం దారుణంగా నిరాశ పరచింది. 8.8 మాత్రమే లాంచింగ్ ఎపిసోడ్‌కి రావడంతో నిర్వాహకులు ఖంగు తిన్నారు.
లాంచింగ్ ఎపిసోడే కాదు వీకెండ్ ఎపిసోడ్స్ కూడా మంచి టీఆర్పీలు రాబట్టడం లేకపోతుందని సమాచారం. బిగ్ బాస్ షోతో పోల్చితే సీరియల్స్ మంచి టీఆర్పీ అందుకుంటున్నాయి. సీరియల్స్ 10 టీఆర్పీ వరకు రాబడుతుంటే బిగ్ బాస్ 6 వీకెండ్ ఎపిసోడ్స్ కూడా 4 టీఆర్పీ దాటలేకపోవడం ఇప్పుడు అయోమయంలో పడేలా చేసింది. బిగ్ బాస్ 6 మొదలై మూడు వారాలు గడుస్తున్నా రేటింగ్ పెద్దగా కనిపించడం లేదు. ఇదే ట్రెండ్ కొనసాగితే నెక్స్ట్ సీజన్ కష్టమే అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 ఉండకపోవచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి.
మంచి కంటెస్టెంట్స్‌తోపాటు కొత్త హోస్ట్ దొరికితే సీజన్ 7 ప్రారంభిస్తారు. లేదంటే దుకాణం సర్ధేసినట్టేనని కొందరు చెబుతున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సారి 21 మంది సభ్యులు హౌజ్‌లోకి అడుగుపెట్టగా ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. షానీ, అభినయశ్రీ, నేహ హౌజ్ నుండి బయటకు వచ్చారు. ఇక నామినేషన్స్ ప్రక్రియ ఉండనుండగా ఈ వారం ఎవరు నామినేట్ అవుతారో చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…