Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్‌గా లాంచ్ కానుండగా, ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరు, షో ఎన్ని రోజులు ప్రసారం కానుందనే దానిపై పూర్తి క్లారిటీ రానుంది. అయితే గత కొద్ది రోజులుగా షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వీరేనంటూ జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. అయితే ఇదే ఫైనల్ లిస్ట్ అని లీకు వీరులు ఓ లిస్ట్ బయట పెట్టారు.
సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం.. ఇస్మార్ట్ అంజలి, యాంకర్ నేహా చౌదరి, గలాటా గీతూ, వాసంతి కృష్ణన్, సుదీప పింకీ, కీర్తి భట్, జబర్దస్త్ ఫైమా, అభినయశ్రీ, సీరియల్ నటి శ్రీ సత్య, ఇనాయా సుల్తానా, బాలాదిత్య, యూట్యూబర్ ఆది రెడ్డి, నటుడు అర్జున్ కళ్యాణ్, మోడల్ రాజశేఖర్, జబర్దస్త్ చలాకీ చంటి, నటుడు శ్రీహన్, గాయకుడు రేవంత్, RJ సూర్య బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.
సీజన్-3 నుంచి హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జుననే ఈ సీజన్‌కు కూడా హోస్ట్‌గా వినోదం పంచనున్నారు. ఇప్పటికే హౌజ్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రోమోలు కూడా విడుదల చేయగా, ఇవి ఎంతగానో ఆకట్టుకున్నాయి. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ షోలో సెలబ్రిటీలే కాదు, ఇద్దరు సామాన్యులు కూడా పాల్గొనబోతున్నారు. వారు ఎవరు, ఎలా సందడి చేయబోతున్నారు అనేది రానున్న రోజులలో తెలియనుంది.
జీవితంలో కొన్నింటిని వదిలేయడం కష్టంగానే ఉంటుంది. నా భార్యతో పాటు.. నాకు ఇష్టమైన మ్యూజిక్‌ని కూడా ఎంతో మిస్ అవుతున్నా. కానీ, ఒక భగీరథడిలా గెలిచి మంచి పేరుతో బయటకు వస్తా. మీ ఓట్లతో నన్ను గెలిపించండి. ఎంటర్ టైన్మెంట్‌కి అంతా సిద్ధమయింది. మీ ఆశీర్వాదాలతో టైటిల్ గెలిచి వస్తాను. త్వరలో కలుద్దాం.. అంటూ సింగర్ రేవంత్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. తద్వారా తాను బిగ్ బాస్ హౌస్‌లోకి వెళుతున్నట్లు చెప్పకనే చెప్పాడీ స్టార్ సింగర్. ఏదేమైనా మరికొన్ని గంటలలో బిగ్ బాస్ సీజన్ 6కి సంబంధించి అన్ని విషయలపై పూర్తి క్లారిటీ రానుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…