Anchor Lasya : ఒకప్పుడు యాంకర్ రవితో కలిసి బుల్లితెరపై తెగ సందడి చేసిన అందాల యాంకర్ లాస్య. ఆమె చెప్పే చీమ, ఏనుగు జోక్స్ జనాలకు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. కొన్నాళ్లపాటు బాగానే అలరించిన లాస్య పెళ్లి తర్వాత బుల్లితెరకు పూర్తిగా దూరమైంది. అయితే బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని మళ్లీ తన అభిమానులకి మంచి వినోదం పంచింది. ప్రస్తుతానికి అడపా దడపా కొన్ని చానల్స్ లో ప్రోగ్రామ్స్ చేస్తున్న లాస్య మరోపక్క తన పేరిట యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి తనకు సంబంధించిన పలు అప్డేట్స్ ను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలోను తెగ సందడి చేస్తూ ఉంటుంది లాస్య.
తాజాగా లాస్య ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. స్పెషలిస్ట్ ల పర్యవేక్షణలో ఉంది. లాస్య భర్త మంజునాథ్ ఆసుపత్రిలో లాస్య చికిత్స పొందుతున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు కామెంట్ చేశాడు. ఇక బెడ్ పై ఉన్న లాస్యకు వరుసగా సెలైన్ ఎక్కిస్తున్నట్టు కనిపిస్తోంది. కాని అసలు లాస్యకు ఏమైంది అన్న వియాన్ని మంజునాథ్ వెల్లడించలేదు. దీంతో యాంకర్ లాస్యకు అసలు ఏం జరిగింది ? ఆమె ఎందుకు హాస్పిటల్లో జాయిన్ అయింది ? అంటూ ఆమె గురించి ఆమె అభిమానులు వాకబు చేస్తున్నారు.
నిజానికి ఆమెకు జ్వరం వచ్చిందని, వైరల్ ఫీవర్ కావడంతోనే హాస్పిటల్లో జాయిన్ చేశారని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది లాస్య కానీ, ఆమె భర్త కానీ క్లారిటీ ఇస్తే కానీ తెలియదు. అభిమానులు, శ్రేయోభిలాషులు లాస్య త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. యాంకర్ లాస్యకు ఒక కుమారుడు ఉన్నాడన్న సంగతి తెలిసిందే. ఆమె లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయాన్ని కూడా బిగ్ బాస్ లో స్వయంగా రివీల్ చేసింది. ఇంట్లో వాళ్లకు తెలియకుండా పెళ్లి చేసుకున్నానని, ఆ తర్వాత ఆర్థిక పరిస్థితుల కారణంగా రెండు సార్లు అబార్షన్ చేయించుకున్నానని చెప్పి షాక్ ఇచ్చింది. ఇక పిల్లలు పుట్టరని బాధపడే తరుణంలో తనకు మగబిడ్డ పుట్టాడని చెప్పింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…