Bhola Shankar : భోళా శంక‌ర్ పోస్ట‌ర్‌పై మొద‌లైన ట్రోల్స్.. షాపింగ్ మాల్ యాడ్‌లా ఉందంటూ కామెంట్స్..

Bhola Shankar : ఈ వ‌య‌స్సులోను కుర్ర హీరోల‌కి పోటీగా సినిమాలు చేస్తూ పోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయ‌న చివ‌రిగా వాల్తేరు వీరయ్య‌తో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించారు. ఈ చిత్రం పెద్ద హిట్ అయింది. ఇక చిరు న‌టించిన భోళా శంకర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని చెప్పవచ్చు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ మెగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాన మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నాడు. ఇక క్రియేటివ్ కమర్షియల్స్తో కలిసి అనిల్ సుంకర యొక్క ఎకె ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నారు. సినిమాలో తమన్నా భాటియా కథానాయికగా నటిస్తుండగా కీర్తి సురేష్ చిరంజీవి సోదరిగా నటించింది. ఇక సుశాంత్ చాలా ప్రత్యేకమైన లవర్ బాయ్ పాత్రలో కనిపించనున్నాడు.

తాజాగా ‘భోళా శంకర్’ సినిమా విడుదల తేదిని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు 11న విడుదల చేస్తున్నట్టు ఉగాది సందర్భంగా ప్రకటించారు. తమన్నా, కీర్తి సురేష్ సోఫాలో కూర్చొగా.. వెనకగా కొండంత అండగా ఉన్న చిరంజీవి ఫోటోతో కూడిన పోస్టర్‌ను విడుదల చేసారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండ‌గా, దీనిపై కొంద‌రు యాంటీ ఫ్యాన్స్ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే ఫొటోలో కీర్తిసురేష్‌ బ్లూ కలర్‌ పట్టు చీరలో మెరిసింది. మెడలో బంగారు అభరణాలు ధరించింది. మరోవైపు తమన్నా పింక్‌ డ్రెస్‌లో ఆకట్టుకుంటుంది. వెనకాల గ్రీన్‌ కలర్‌ షర్ట్ ధరించి కూల్‌ గ్లాసెస్‌ పెట్టుకుని స్టయిల్‌గా నిల్చున్నాడు చిరజీవి.

Bhola Shankar latest poster netizen troll
Bhola Shankar

కొందరు నెటిజన్లు దీన్ని షాపింగ్‌ మాల్‌ యాడ్‌గా మార్చి ట్రోల్స్ చేస్తున్నారు. కొత్త పోస్టర్‌ `సీఎంఆర్‌` షాపింగ్‌ మాల్‌ యాడ్‌లా ఉందని, మరికొందరు చందనా బ్రదర్స్ సిల్క్ సెంటర్‌లా ఉందని పోస్టర్ల డిజైన్‌ మార్చి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. షాపింగ్‌ మాల్స్ కి యాడ్‌ చేస్తున్నట్టుగా, ప్రమోటర్‌గా ఉన్నారని కాస్త వెట‌కారంగా కామెంట్స్ చేస్తున్నారు. మ‌రి దీనిపై చిత్ర బృందం ఏమైన స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago