Anasuya : అందాల ముద్దుగుమ్మ అనసూయ యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టి అనంతరం నటిగా మారింది. ఇప్పుడు పూర్తి స్థాయి నటిగా మారిన అనసూయ పెద్ద పెద్ద సినిమాలలోను నటిస్తుంది.అల్లు అర్జున్ నటించిన పుష్స చిత్రంలో దాక్షాయణి పాత్రలో నటించిన అనసూయ ఎంతో మెప్పించింది. ఇక ఆమె కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన ‘రంగమార్తాండ’ సినిమాలో కూడా మెప్పించింది. ప్రకాష్‌రాజ్‌కు కోడలిగా ఆమె కనిపించింది. అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా ‘రంగమార్తాండ’ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్‌లో కృష్ణవంశీ, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, అనసూయ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ కృష్ణవంశీ వైపు తిరిగి ఆయనకు రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి భావోద్వేగానికి గురయ్యారు. ‘నాకు చాలా ఎమోషనల్‌గా ఉంది. మళ్లీ యాక్ట్ చేస్తున్నానని అంటారు’ అని అనసూయ ఏడ్చేశారు. భావోద్వేగంతో వచ్చిన కన్నీళ్లు, వణుకుతున్న గొంతుతోనే అనసూయ మాట్లాడుతూ.. ‘రంగమార్తాండ అనే సినిమాలో నేను ఉన్నాను. నా జీవితానికి ఇది చాలు. ఈ సినిమాను ఫస్ట్ టైమ్ చూశాను. నా డబ్బింగ్ వరకు మాత్రమే సినిమా గురించి నాకు తెలుసు. సినిమా మొత్తం ఎప్పుడు చూద్దామా అని ఎదురుచూశాను. ఊళ్లో లేకపోవడం వల్ల ఇప్పటి వరకు చూడలేదు.
ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం వల్ల ‘రంగమార్తాండ’ సినిమాలో నటించగలిగానని అనసూయ అన్నారు. తెరమీద, బయట ‘రంగమార్తాండ’ టీమ్‌తో గడిపిన క్షణాలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని అనసూయ చెప్పుకొచ్చింది.. అయితే, ప్రెస్ మీట్‌కు ముందు ‘రంగమార్తాండ’ ప్రమోషన్స్‌లో భాగంగా అనసూయ ఇంటర్వ్యూలు ఇవ్వగా, ఆమె సినిమాలో తన పాత్రను చూసి ప్రేక్షకులు తనను తిట్టుకుంటారేమోనని దర్శకుడు కృష్ణవంశీతో అన్నానని అనసూయ గుర్తుచేసుకున్నారు. రంగస్థల నటీనటుల జీవితాన్ని ఆధారంగా చేసుకుని మరాఠిలో తెరకెక్కిన సక్సెస్ ఫుల్ ఫిల్మ్ ‘నటసామ్రాట్’కు రీమేక్ గా తెలుగులో ఈ చిత్రాన్ని రూపొందించారు ఈ సినిమాలో రాహుల్ సిప్లిగంజ్ తోపాటు శివాని రాజశేఖర్, ఆదర్శ్ బాలకృష్ణ, అలీ రెజ ముఖ్య పాత్రల్లో నటించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…