Hema : సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌ని ఆశ్ర‌యించిన న‌టి హేమ‌.. కార‌ణం ఇదే..!

Hema : న‌టి హేమ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దశాబ్దాల కాలం నుంచి హేమ టాలీవుడ్ లో కీల‌క పాత్ర‌ల‌లో న‌టిస్తూ అల‌రిస్తూ వ‌చ్చింది. అయితే ఇటీవ‌లి కాలంలో ప‌లు వివాదాల‌తో వార్త‌ల‌లో నిలుస్తూ వ‌చ్చిన హేమ తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్తతో ఉన్న వీడియోలు, ఫొటోలను ఫేక్ తంబ్‌నెయిల్స్‌తో యూట్యూబ్‌లో పోస్ట్ చేశారని ఈ ఫిర్యాదులో హేమ పేర్కొంది. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ అసత్య ప్రచారం చేస్తోన్న యూట్యూబ్ ఛానెల్స్, వెబ్‌సైట్లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో హేమ కోరింది.

మూడేళ్ల కిందట పెళ్లి రోజు వేడుకల సందర్భంగా భర్తతో ఉన్న ఫొటోలను ఇప్పుడు మరోసారి పోస్టు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని , దీనిపై తాను న్యాయపోరాటం చేసేందుకు కూడా వెనుకాడనని స్పష్టం చేశారు. సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేసే యూట్యూబ్ చానళ్లు, వెబ్ సైట్లపై చర్యలు తీసుకోవాలని ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను కోరింది. కొందరు సినీ ప్రముఖులు బతికే ఉన్నప్పటికీ, వారు చనిపోయారంటూ డబ్బుల కోసం అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని హేమ ఆవేదన వ్యక్తం చేసింది. అందుకు ఉదాహరణగా కోట శ్రీనివాసరావు అంశాన్ని ప్రస్తావించారు. కోట ఇక లేరంటూ తప్పుడు ప్రచారం చేశారని చెప్పుకొచ్చింది.

Hema complaint to cyber crime police about fake news
Hema

న‌టి హేమ ప్రేమ వివాహం చేసుకున్న విష‌యం విదిత‌మే. దూరదర్శన్‌లో నటించేటప్పుడు జాన్ కెమెరామేన్‌గా పనిచేశారని, ఆయ‌న‌తో ప‌రిచ‌యం ప్రేమ ఏర్ప‌డి పెళ్లిచేసుకుంటానని అడగడంతో తాను కూడా నో చెప్పలేకపోయానని అన్నారు. తనకు 18 నుంచి 19 ఏళ్ల మధ్యలోనే వివాహం జరిగిపోయిందన్నారు. అయితే, ఇంట్లో తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని ఓ సంద‌ర్భంలో చెప్పారు. హేమ కూతురు ఇషా కాగా, ఆమె వయసు ఇప్పుడు 22 ఏళ్లు. ఇటీవ‌ల కూతురితో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టారు. ఇషా బీబీఏ పూర్తిచేసిందని సమాచారం.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago