Barrelakka : బర్రెలక్క.. అలియాస్ శిరీష. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పేరు. 25 ఏళ్ల అతి చిన్న వయసులోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతుండగా, ఆమె కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతోన్న బర్రెలక్కకు పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ విపరీతమైన మద్దతు లభిస్తోంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు బర్రెలక్క వీడియో ట్రెండింగ్‌లో ఉంటోంది. ఇదే సమయంలో తెలంగాణ ఎన్నికలు రావడంతో తానే ఎమ్మెల్యేగా ఎందుకు పోటీచేయకూడదని ఆలోచించింది.
తెలంగాణ నిరుద్యోగులు పడుతున్న కష్టాలను ఆమె తన ప్రచారాస్త్రాలుగా మలుచుకుంది. నిరుద్యోగ యువత నుంచే కాక పలు గ్రామాల్లో బర్రెలక్కకు పూర్తి మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలోనే బర్రెలక్కకు భారీ ఆఫర్లే ఇతర రాజకీయ నాయకుల నుంచి వచ్చాయి. కానీ వాటికి తలొగ్గకుండా ఆమె లక్ష్యం వైపు వెళుతున్నారు. అయితే ప్రస్తుతం కేసీఆర్, బర్రెలక్క మధ్య ఇన్‌డైరెక్ట్ పోరు నడుస్తుంది. కేసీఆర్ ఇటీవల నిర్వహించిన సభలో ఎవరిని ఈజీగా నమ్మవద్దని , నిజాయితీ వ్యక్తులకి ఓటు వేస్తే మీకు రేపటి రోజు ఏదైన మంచి జరగుతుందని చెప్పుకొచ్చింది. బర్రెలక్కపై ఇన్‌డైరెక్ట్‌గా కేసీఆర్ చేసిన విమర్శలకి కొంత మంది నెగెటివ్ విమర్శలు చేస్తున్నారు.
కేసీఆర్ వర్సెస్ బర్రెలక్క మధ్య పోటీగా అందరు చూస్తున్నారని తెలుస్తుంది. అయితే బర్రెలక్క వలన తమ ఓటు బ్యాంకుకు ఎక్కడ చిల్లు పడుతుందో అని భావించిన ప్రత్యర్థులు ఆమెపై, ఆమె అనుచరులపై దాడి కూడా చేశారు. దీంతో హైకోర్టు జోక్యం చేసుకుని బర్రెలక్కకు భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక బర్రెలక్క ప్రచారంలో దూసుకెళుతోంది. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బర్రెలక్క ప్రచారంలో ఓపాటకు అవ్వ తాతలు డాన్స్ చేస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. బర్రెలక్క ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తుందని పలువురు ఆమెను దీవిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…