Barrelakka : బర్రెలక్క.. ఇప్పుడు ఈ పేరు తెగ మారుమ్రోగిపోతుంది. సరదాగా చేసిందో.. లేక తన అసహనాన్ని తెలిపేందుకు చేసిందో కానీ.. ఓ రీల్ తన జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. ప్రస్తుతం ఎన్నికల బరిలో దిగి.. తెలంగాణలో ఓ సంచలనంగా మారింది బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి బర్రెలక్క పోటీ చేస్తున్నా.. తనకు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. నిరుద్యోగుల సమస్యలపై పోరాడేందుకు బరిలో దిగేందుకు నిర్ణయించుకున్న బర్రెలక్కకు.. కేవలం యువత నుంచే కాదు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది.
ఈమె క్రేజ్‌కు తగినట్లుగానే ఆంధ్రాలో సైతం బర్రెలక్కకు అభిమానులు పుట్టుకొచ్చారని చెప్పవచ్చు. ప్రధానంగా ప్రకాశం జిల్లాలో రూపాయి సేవా అనే కార్యక్రమం ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఓ యువకుడు, తెలంగాణకు వెళ్లి బర్రెలక్కను కలిసి మద్దతు ఇవ్వడమే కాక నాలుగు రోజులు ప్రచారం సైతం నిర్వహించాడు. అయితే కోడెర్ మండలంలో బర్రెలక్క ప్రచారం జోరుగా కొనసాగింది. బర్రెలక్క అభిమానులు ఆమెకు అభిమానంతో కిరీటాన్ని బహుకరించారు. కిరీటాన్ని ధరించిన బర్రెలక్క .. పెద్దకొత్తపల్లిలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రచారం నిర్వహించారు. విజిల్ గుర్తు పై ఓటువేసి కొల్లాపూర్లో భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ ప్రచారంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొని బర్రెలక్కను గెలిపించాలని మద్దతు ఇచ్చారు.
బర్రెలక్క తన ప్రచారంలో కేసీఆర్‌పై నిప్పులు చెరిగింది. కేసీఆర్ ఎక్కడెక్కడో తన కూతురు, కొడుక్కి పెద్ద పెద్ద బిల్డింగులు కొనిచ్చాడు. మనకి మాత్రం ఏం చేశాడు. ఆయన వల్లే కదా మనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. నన్ను గెలిపిస్తే మీకు మంచి చేస్తాను. అందరికి ఉద్యోగాలు వచ్చేలా చేస్తాను. ఎన్నో బెదిరింపు కాల్స్ వచ్చినా.. దాడులు జరిగినా.. పోలీసులు రక్షణ కల్పించకపోయినా.. మొక్కవోని ధైర్యంతో.. తనతో కలిసి నడుస్తున్న యువతే కొండంత అండగా ముందుకు సాగుతోంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…