Mainampalli Hanumantha Rao : తెలంగాణ ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో ప్రచారాలు హోరెత్తిపోతున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు. బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి కాంగ్రెస్ లో చేరిన ఆయన..కేసీఆర్, కేటీఆర్ వ్యక్తిగత జీవితాల గురించి తనకు పూర్తిగా తెలుసంటూ వివాదాస్పద విషయాలను బయటపెట్టారు. తనను ఓడించేందుకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ మండిపడ్డారు. నువ్వు, నీ తండ్రి ఎన్ని వేషాలు వేసినా ఇక్కడ చెల్లదన్నారు.
తాను ముందు నుంచి ఉద్యమంలో ఉన్నానని నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పాలన్నారు. తన గురించి ఇంకోసారి నోరు జారితే బాగుండదంటూ హెచ్చరించారు. నువ్వు ఎవరికీ తెలియకుండా బెంగళూరుకు ఎందుకు వెళుతున్నావో చెప్పమంటవా అని ప్రశ్నించారు. నన్ను గూండా అంటావా..నీకు ఎంత ధైర్యం, బిడ్డా నాతో పెట్టుకుంటే మటాష్ అయి పోతవ్ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదంటూ స్పష్టం చేశాడు మైనంపల్లి హనుమంత రావు.బీజేపీని ఇక్కడ తిట్టి ఢిల్లీకి కాళ్లు పట్టుకునే నీకు, నీ తండ్రికి నన్ను విమర్శించే హక్కు లేదన్నారు. మల్కాజ్ గిరి, మెదక్ లో ఓడి పోతారనే భయంతోనే తనపై విమర్శలు చేస్తున్నారంటూ మంత్రి కేటీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మల్లారెడ్డిది తన స్థాయి కాదని అన్నారు. ఆయనకు చదువు రాదని, ఒక బఫూన్ అని విమర్శించారు. రాజకీయాల్లో మల్లారెడ్డి ఒక బిచ్చగాడని అన్నారు. ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. తాను మాత్రం జాక్ ఆఫ్ ఆల్ అని చెప్పారు. రాజకీయాల్లోనే కాకుండా క్రీడల్లో కూడా తాను ఫస్టేనని అన్నారు. క్రికెట్లో తాను ఓపెనర్ గా వెళ్లి నాటౌట్ గా వచ్చేవాడినని చెప్పారు. వాలీబాల్ టీమ్ ను కూడా తానే లీడ్ చేసేవాడినని తెలిపారు. మల్లారెడ్డికి డ్యాన్స్ లు తప్ప మరేమీ రావని అన్నారు. పాలమ్మినా, పూలమ్మినా అంటాడని… ఆయనకు సబ్జెక్ట్ లేదని చెప్పారు. హరీశ్ తీవ్ర అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. హరీశ్ తో పాటు మల్లారెడ్డి కూడా జైలుకు వెళ్లడం ఖాయమని కూడా మైనంపల్లి అన్నారు. అలానే చంద్రబాబుని మోసం చేసింది కేటీఆర్ అన్నట్టుగా మైనంపల్లి కొన్ని కామెంట్స్ చేశారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…