Barrelakka : ఈ సారి ఎన్నికలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది బర్రెలక్క. ఎంత చదివినా డిగ్రీలకు డిగ్రీలు మెమోలు వస్తున్నాయి గానీ జాబ్‌లు అయితే వస్తలేవు. నోటిఫికేషన్ వేయరు.. ఏం వేయరు అందుకే మా అమ్మను అడిగి నాలుగు బర్లు కొన్నా… పొద్దున 3 లీటర్లు, సాయంత్రం 3 లీటర్లు మొత్తం 6లీటర్ల పాలు ఇస్తాయి… రోజుకు రూ.300ఎక్కడ పోవు ఫ్రెండ్స్… ఇవ్వే మా బర్లు” అంటూ ఆమె చేసిన వీడియో నెట్టింట అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. ఈమె అసలు పేరు శిరీష కాగా, స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్. డిగ్రీలు చేసినా ఉద్యోగాలు రావడం లేదంటూ వినూత్నంగా రూపొందించిన ఆమె వీడియో సందేశం రెండేళ్ల క్రితం తెగ వైరల్ కావడంతో ఆమెకి ప్రత్యేక గుర్తింపు దక్కింది.
బర్రెలక్కగా తెలంగాణ ప్రజలకు సుపరిచితులైన శిరీష నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచింది. ఆమె ఎప్పుడైతే బరిలో నిలిచిందో ఆమె పేరు తెగ మారుమ్రోగింది. గెలిచి సంచలనం సృష్టిస్తుందేమో అని అందరు అనుకున్నారు. కాని బర్రెలక్క పూర్తిగా నిరాశపరచింది. బర్రెలక్క తమ్ముడిపై కూడా ఎన్నికల్లో నిలబడ్డాక దాడి జరగడంతో… ఆమె గెలుస్తుందనే భయంతోనే ఇలా చేస్తున్నారని తెలంగాణలో చాలా మంది మండిపడ్డారు. కాని నిరాశనే ఎదురైంది. అయితే ఆమె నిరుద్యోగుల కోసం పోరాడిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టకుంది. ఇప్పుడు ఏకంగా రేవంత్ రెడ్డి కూడా బర్రెలక్క గురించి తెలుసుకొని ఆమెని తమ పార్టీలోకి ఆహ్వానించినట్టు ప్రచారం జరుగుతుంది. మరి దీనిపై క్లారిటీ రావలసి ఉంది.
ఇక ఇదిలా ఉంటే ఇంటి పెద్ద కొడుకు ప్రయోజకుడైతే ఎంత సంతోషం ఉంటుందో అంతకంటే ఎక్కువ ఆనందం ఉందని మురిసిపోతున్నారు రేవంత్ రెడ్డి గ్రామస్థులు. రేవంత్ ఎప్పుడు ఊరికి వచ్చినా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తాడని చెప్పుకొచ్చారు. అత్త, మామ, బావ, అక్క అంటూ వరుసలు కలుపుతూ కలిసిపోతారని.. ఆయన ఊరికి వచ్చాడంటేనే పండుగలా ఉంటుందంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని వివరించారు. తమ పటేల్ చాలా మంచివాడంటూ తెలిపారు. ప్రతీ దసరాకు ఊరికి వచ్చి అందరితో సరదాగా గడుపుతారని వివరించారు. ఢిల్లీకి రాజైనా.. తల్లికి కొడుకే అన్నట్టు ఆయన ఏ పదవిలో ఉన్న సొంతూరిని, ఊరి ప్రజలను మాత్రం ఆయన మర్చిపోరంటూ గ్రామస్థులు ఎంతో గొప్పగా చెప్పారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…