Tirumala Anna Prasadam : తిరుమ‌ల భోజ‌న వివాదం.. ఇది అన్నమేనా అని తిట్టిపోస్తున్న భ‌క్తులు..

Tirumala Anna Prasadam : తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో నిత్యం అన్న‌దానం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. కొన్ని వేల కొల‌ది భ‌క్తులు ఈ అన్న‌ప్ర‌సాదాన్ని స్వీక‌రిస్తారు. అయితే తాజాగా భక్తులకు వడ్డించే ఆహారం నాణ్యత సరిగ్గా లేదంటూ కొందరు గొడవ చేయడం కలకలం రేపింది. సిబ్బంది వడ్డించిన అన్నప్రసాదం ఉడకలేదని, మరికొంత ముద్దగా ఉందని విమర్శలు చేస్తూ.. వాగ్వాదానికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ది అన్నమేనా! ఎలా తినాలి? పశువులమా, మనుషులమా! మీ ఇంట్లో అయితే ఇలాంటి అన్నం తింటారా?’’ అంటూ తిరుమల వెంగమాంబ నిత్యాన్నప్రసాద భవనంలో భక్తులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.

సోమవారం రాత్రి భోజనాలలో ఉడకని అన్నం వడ్డించడంతో భక్తులు తీవ్రంగా ఆవేదన చెంది సిబ్బందిని నిలదీశారు. బయట తినలేక కాదనీ, స్వామి ప్రసాదంగా భావించి పవిత్రభావంతో ఇక్కడికి వచ్చామని చెప్పుకొచ్చారు. ఇంత దారుణంగా ఉంటే ఎలా తినేదని వారు ప్ర‌శ్నించారు. ఆ సమయంలో అయ్యప్పభక్తులు కూడా ఉన్నారు. అనేకమంది అరిటాకుల్లోనే అన్నం వదిలేశారు. విధుల్లో ఉన్న సిబ్బందిపై మండిపడ్డారు. ఉద్యోగి మద్యం తాగి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇంతలో విజిలెన్స్‌ ఉద్యోగులు అక్కడికి చేరుకుని వాతావరణం కారణంగా అన్నం గట్టిపడిందని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఎవరో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.

Tirumala Anna Prasadam what really happened there
Tirumala Anna Prasadam

ఈ వివాదంపై టీటీడీ చైర్మన్ భుమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ’’ఏళ్లుగా వెంకన్న భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్నాం. ఇన్నేళ్లల్లో ఏనాడూ ఏ ఒక్కరూ అన్నప్రసాదాన్ని విమర్శించడం చూడలేదు. తిరుమల అన్నదానానికి సంబంధించి ఇంత వరకు ఒక్క ఫిర్యాదు రాలేదు. కానీ తాజాగా వెంగమాంబ అన్నప్రసాదాలయంలో కొంతమంది అన్నం నాణ్యత గురించి అల్లరి చేసినట్లు మాకు సమాచారం వచ్చింది. వచ్చిన వాళ్ల ఎమోషన్ ను గుర్తుంచుకోవాలి‘‘ అన్నారు. తప్పు జరిగితే సరిదిద్దుకోవడానికి టీటీడీ సిద్ధంగా ఉంటుంది. కానీ కొందరు పని గట్టుకుని ఆందోళన చేయాలని, అప్రతిష్ట పాలు చేయాలని భావిస్తున్నారు. అందుకే మిగతా భక్తులను రెచ్చగొట్టి.. ఆందోళన చేయించారు. ఇది సరైంది కాదు. పైగా దీన్ని వైరల్ చేస్తున్నారు. దీని వెన‌క ఏదో దురాలోచ‌న ఉంద‌ని ఆయ‌న అన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago