Bandla Ganesh : కమెడీయన్ గా కన్నా, పవన్ భక్తుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు బండ్ల గణేష్. రాజకీయాల కారణంగా వ్యక్తిగతంగా చాలా నష్టపోయినట్లు సినీ నిర్మాత బండ్ల గణేష్ ఓ సందర్భంలో తెలియజేశాడు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసిన బండ్ల గణేష్.. 3-4 ఏళ్ల క్రితం తెలంగాణ లో చాలా యాక్టీవ్‌గా కనిపించాడు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే బ్లేడ్‌తో గొంతు కోసుకుంటానని అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో బీరాలు పలికాడు. కానీ..ఆ ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ పార్టీ తేలిపోయింది. దాంతో కొన్నాళ్లు మీడియాకి దూరంగా ఉన్నాడు.
ఇక ఇదిలా ఉంటే బండ్ల గణేష్ రీసెంట్‌గా రాజకీయాల కారణంగా జీవితంలో చాలా నష్టపోయాను. నాకు ఇప్పుడు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. అందరూ ఆత్మీయులే అని ఓనెటిజన్ కి రిప్లై ఇచ్చాడు. మరో నెటిజన్.. కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నవారే.. రాజకీయాల్లోకి రావాలి లైక్ అవర్ బాస్ అంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ పేరుని ప్రస్తావించగా, దానికి బండ్ల గణేష్.. నాకంత స్థాయి లేదు.. అంత గొప్పవాడిని కూడా కాదు సోదరా అని రిప్లై ఇచ్చాడు. పవన్‌కి రాజకీయాలలో వెన్నంట నిలుస్తాడని అందరు ఊహించగా, మనోడు ఇలా కామెంట్స్ చేసే సరికి అందరు ఆశ్చర్యపోయారు.
పవన్ కళ్యాణ్ భక్తుడిగా.. బండ్ల గణేష్ ఆయన్ని డిపెండ్ చేస్తూ ఉంటాడు. పవన్ ని ఎవరైనా విమర్శిస్తే వెంటనే రియాక్ట్ అవుతాడు.అలాంటి బండ్ల గణేష్ ఎవరితో గొడవులు పెట్టుకోకుండా మంచోడిలా ఉంటానని చెప్పడంతో ఫ్యాన్స్ నీరసించి పోయారు. బండ్ల జనసేనలో చేరి పవన్‌కి అండగా ఉంటే ఆ ఎనర్జీ వేరే లెవల్‌లో ఉండేది కాని ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిరుత్సాహపరుస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకకు ఆహ్వానం అందలేదని దర్శకుడు త్రివిక్రమ్ ని బండ్ల గణేష్ తిట్టడంతోఈయనని దూరం పెట్టాడట పవన్. ఇక బండ్ల కూడా పవన్‌పై చాలా కోపంగా ఉన్నాడని టాక్ నడుస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…