Bandla Ganesh : రూ.100 కోట్ల స్కామ్ చేసిందా.. అంటే బండ్ల గ‌ణేష్ ఏమ‌న్నారో చూడండి..!

Bandla Ganesh : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎంత ప్ర‌భంజనం సృష్టించాయో మ‌నం చూశాం. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చేలా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కూటమి అత్యధిక స్థానాలను గెలుచుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రోజా ఓట‌మి చెంద‌డంతో ఆమెపై విమ‌ర్శ‌లు కురిపించారు బండ్ల గ‌ణేష్‌. ‘జబర్దస్త్ పిలుస్తుంది రా కదలిరా’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. తద్వారా రాజకీయాలకు సెలవు ఇచ్చేసి.. మళ్లీ టీవీ షోలు చేసుకో అంటూ కొద్ది రోజుల క్రితం సలహా ఇచ్చాడు బండ్ల గ‌ణేష్‌.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో మాజీ మంత్రి రోజాపై విరుచుకుపడుతున్నాడు బండ్ల గణేష్. తాజాగా ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్‌ పోటీలలో రోజా రూ.100 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారంటూ కథనాలు వస్తుండటంతో బండ్ల గణేష్ స్పందించారు. ఓ ఛానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రోజా నూటికి నూరు శాతం స్కాం చేసే ఉంటుందంటూ ఆరోపించారు. ఇతరుల గురించి తెలియకుండా మాట్లాడనని.. స్కాముల్లో ఆమె డైమండ్ రాణి అంటూ బండ్ల గణేష్ సెటైర్లు వేశారు. బండ్ల గణేష్ ఎవరో తెలియదని ఓ ఇంటర్వ్యూలో చెప్పిందని.. రోజాకు ఎదురు చెప్పేవాళ్లు ఉండకూడదా అని ప్రశ్నించారు. ఒక్క 100 కోట్లే కాదు.. ఆవిడపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని బండ్ల గణేష్ డమాండ్ చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి పంపించినందుకు డబ్బులు వసూలు చేసేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bandla Ganesh comments on rk roja 100 crores scam
Bandla Ganesh

పవన్‌ కళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోయాడంటూ ఆమె నవ్వుకునేదని.. అసెంబ్లీ గేటును కూడా టచ్ చేయలేడని రోజా మాట్లాడిందని బండ్ల గణేష్ మండిపడ్డారు. కానీ ఇప్పుడు పోటీ చేసిన 21 స్థానాల్లో గెలిచిన ఏకైక నాయకుడు పవన్ అని ఆయన స్థాయికి కొంచెం తగ్గే ఉన్నారని గణేష్ తెలిపారు. రోజా లాంటి నేతలంతా కలిసి జగన్‌ను ట్రాన్స్‌లో పెట్టారని.. నువ్వు దేవుడన్నా అంటూ మోసేసి చివరికి ఈ స్థితికి తీసుకొచ్చారని బండ్ల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago