Allu Arjun : గత కొద్ది రోజులుగా మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చ డ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. దీనికి కారణం ఏంటో మనందరికి తెలిసిందే. గత కొన్ని రోజులుగా అల్లు, మెగా ఫ్యామిలీకి సంబంధించి అనేక ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్‌కు అండగా నిలిస్తే..ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా..అక్కడి వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది.
అయితే ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం..అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు. దీంతో మెగా అభిమానులు అల్లు అర్జున్‌ను టార్గెట్‌గా పెట్టుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి అల్లు అభిమానులు సైతం గట్టిగానే కౌంటరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్, బన్నీ వర్సెస్ రామ్ చరణ్ అంటూ పోస్టులు పెడుతూ ఎవరికి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉందో తేల్చుకుందాం రండి అంటూ ఛాలెంజ్ చేస్తున్నారు. వీటికి మెగా అభిమానులు కూడా అదే రేంజ్‌లో రియాక్ట్ అవుతున్నారు. పుష్ప 2 సినిమాను బ్యాన్ చేస్తామని ఏపీలో కలెక్షన్లపై దీని ప్రభావం ఉంటుందంటూ పోస్టులు చేస్తున్నారు.
‘పుష్ప-2’ చిత్రాన్ని తాము కొన్ని కారణాల వల్ల కుటుంబంతో కలిసి చూడొద్దని జనసైనికులు, మెగా ఫ్యాన్స్ భావించామని కొందరు నెటిజన్స్ పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ‘పుష్ప-2’ను వాయిదా వేయడంలో బన్నీ మీద ప్రస్తుతం నెలకొన్న నెగెటివిటీ కూడా కారణమని కొందరు చెబుతున్నారు. ఆగస్ట్ 15న విడుదల కావల్సిన ఈ సినిమా డిసెంబరక్‌కి పోస్ట్ పోన్ కావడానికి కారణం పవన్ కళ్యాణ్ కారణమని కొందరు అంటున్నారు. కొన్ని నెలలు గడిస్తే పరిస్థితి మారుతుందని అందుకే చిత్రాన్ని కొన్నాళ్లు వాయిదా వేసారని టాక్ వినిపిస్తుంది. సినిమాలో సత్తా ఉంటే, కంటెంట్ ఉంటే ఎవరు ఆపాలని చూసినా తగ్గేదేలే అంటూ బన్నీ అభిమానులు గట్టిగానే మెగా అభిమానులకు కౌంటరిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు వివాదం గట్టిగానే ట్రెండింగ్ అవుతుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…