Balakrishna : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు అరెస్టు తర్వాత రాజకీయాలు ఎంత రసవత్తరంగా మారుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఊహించని విధంగా తెరమీదకు వచ్చిన నారా బ్రాహ్మణి, భువనేశ్వరి వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు. అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును ఇరికించారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో బ్రాహ్మణి, భువనేశ్వరిపై మంత్రి రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో దొరికిపోయిన చంద్రబాబు జైల్లో కూర్చుంటే కనీసం సిగ్గు లేకుండా చంద్రబాబు భార్య, ఆయన కోడలు, గంట కొట్టండి, విజిల్స్ వేయండి .. సీఎం జగన్ కు బుద్ధి చెప్పండి అంటున్నారని మండిపడ్డారు. నారా బ్రాహ్మణి తెలియక మాట్లాడుతుందో తెలిసి అబద్ధాలు ట్వీట్ చేస్తున్నారో అర్ధం కావడం లేదు అంటూ విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడైనా ఆలోచించారా అంటూ రోజా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైకోలు ఎవరైనా ఉంటే అది మీ నాన్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, మీ మామ నారా చంద్రబాబు నాయుడు మాత్రమే అంటూ రోజా తీవ్రవ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి ఇంకోసారి మాట్లాడితే మర్యాద దక్కదని రోజా హెచ్చరికలు జారీ చేశారు. ఇన్ని రోజులు బ్రాహ్మణి రాజకీయం చేయలేదు కాబట్టి తాను మాట్లాడలేదని, ఇప్పుడు అసత్య ట్వీట్లు చేస్తున్నారు కాబట్టి మాట్లాడుతున్నానని మంత్రి రోజా మండిపడ్డారు. రాజకీయాల్లో 45 ఏళ్ల ఇండస్ట్రీ అని పబ్లిసిటీ చేసుకునే చంద్రబాబు ప్రజల కోసం చేసింది ఏమీ లేదని రోజా మండిపడ్డారు.
అయితే రోజా కామెంట్స్‌పై బాలయ్య తనదైన శైలిలో స్పందించారు. మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగుండదు. చంద్రబాబు నాయుడు పిక్క మీద ఉన్న వెంట్రుక కూడా మీరు పీకలేరు. అరెస్ట్‌లకి మేమెవరం భయపడం. తెలుగు దేశంకి దక్కుతున్న ఆదరణ చూసి అలాంటి కామెంట్స్ చేస్తున్నారు. ఫైబర్ గ్రిడ్ కేసు పెడతామని వైసీపీ నాయకులు అంటున్నారు. ఫైబర్ గ్రిడ్‌లో అవినీతిని నిరూపించాలని వైసీపీ నాయకులకు ఎమ్మెల్యే బాలకృష్ణ ఛాలెంజ్ విసిరారు. రాష్ట్ర అభివృద్ధిని వైసీపీ గాలికి వదిలేసి..జగన్ ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఏ ఆధారం ఉందని చంద్రబాబును అరెస్ట్ చేశారని ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రశ్నించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…