విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ చెక్క దిమ్మె.. అందులో ఏముంది అంటే..!

విశాఖ‌ప‌ట్ట‌ణంలో వైఎంసీఏ బీచ్‌ తీరానికి ఓ భారీ చెక్క పెట్టె అలల మధ్య కొట్టుకు రావ‌డం క‌ల‌క‌లం రేపింది. మత్స్యకారులు ఈ పెట్టెను గమనించి. పోలీసులకు స్థానికులు సమాచారం అందించగా.. పురాతమైన చెక్క పెట్టె కావడంతో ప్రొక్లెనర్‌ సహాయంతో ఒడ్డుకు చేర్చారు. చూసేందుకు భారీగా ఉన్న ఈ పెట్టెను బ్రిటీష్ కాలం నాటిదిగా అంచనా వేసారు. పురాతన పెట్టె ఇలా ఒడ్డుకు వచ్చిందని ఆర్కియాలజీ విభాగానికి సమాచారం ఇవ్వగా వారు వచ్చారు. .ఈ భారీ పెట్టెను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. వారిని కట్టడి చేయడానికి పోలీసులు ఇబ్బందిపడాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ పెట్టెలో ఏముందనేది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. ఈ పెట్టె బరువు 100 టన్నుల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

అందరి సమక్షంలో పెట్టెను జేసీబీల సాయంతో పగులగొట్టారు.. ఆ పెట్టెలో ఏమీ లేదని తేల్చారు. కేవలం చెక్కల్ని ఓ దిమ్మెగా తయారు చేసినట్లు మాత్ర‌మే వారు గుర్తించారు. అత్యవసర సమయాల్లో బోట్ల కోసం వేసే లంగరు బాక్స్‌గా దానిని గుర్తించారు. జేసీబీల సాయంతో పెట్టెను ఓపెన్ చేశారు.. చెక్క లేయర్స్ తప్ప ఏమీ లేదని తేల్చారు. అయితే బీచ్‌లో ఉన్న సందర్శకులు మాత్రం ఆ భారీ పెట్టెను చూసేందుకు ఎగబడ్డారు. వారిని పోలీసులు కట్టడి చేయడానికి ఇబ్బందిపడాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ పెట్టెలో ఏముందనేది అందరిలో ఉత్కంఠ రేపగా.. చివరికి ఏమీ లేదని తేలింది.

vizag box at beach what is in it

విశాఖ తీరానికి ఇలా వస్తవులు కొట్టుకురావటం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలా కొన్ని వస్తువులు కొట్టుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. గతంలో ఆర్కే బీచ్ లో బ్రిటిష్ కాలం నాటి బంకర్లు బయటపడ్డాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి కాంక్రీట్ బంకర్ గా గుర్తించారు. జపాన్ సైన్యాన్ని ఎదుర్కొనేందుకు అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం ఈ పిల్‌ బాక్సులను ఏర్పాటు చేసిందని అధికారులు తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో శత్రువులపై దాడి కోసం నిర్మించిన బంకర్‌లు చాలా వరకు విశాఖ తీరంలో ఉన్నాయి. అయితే, కాలక్రమంలో సముద్రపు అలల తాకిడికి కొన్ని ఇసుకలో కూరుకుపోయాయి. జాలరి పేట వద్ద మాత్రం బంకర్ శిథిల స్థితిలో కనిపిస్తోంది. తాజాగా వాతావరణ మార్పులతో పాండురంగ స్వామి ఆలయం సమీపాన ఓ బంకర్ బయటపడింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago