Lu Lu Mall : జ‌నంతో కిక్కిరిసిపోయిన లులు మాల్.. కూక‌ట్‌ప‌ల్లి ప్రాంత వాసుల‌కి న‌ర‌కం..

Lu Lu Mall: గత సంవత్సరం దావోస్‌లో జరిగిన “ప్రపంచ ఆర్థిక సదస్సు “పర్యటన సందర్భంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ యూఏఈ ప్రఖ్యాత సంస్థ లూలు గ్రూప్ తో చ‌ర్చలు జ‌రిపిన విష‌యం తెలిసిందే. చ‌ర్చ‌ల అనంత‌రం హైదరాబాద్ లో లులు షాపింగ్ మాల్ ఏర్పాటునకు ఆ సంస్థ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్ర‌మంలో హైదరబాద్ కూకట్ పల్లిలో షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారు. గతంలో కూకట్‌పల్లిలోని మంజీరా మాల్‌ ను లులు గ్రూప్‌ రీబ్రాండ్‌ చేసింది.ఈ లులు గ్రూప్ షాపింగ్ మాల్ 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ మాల్ ను రీసెంట్‌గా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.సాధారణంగానే నగర వాసులు కొత్త‌గా ఏర్పాటైన ఏ మాల్‌ని వ‌దిలి పెట్టరు.

అయితే ఇప్పుడు ఈ లుల్ మాల్‌కి మాత్రం తాకిడి విప‌రీతంగా పెరిగింది. మూడు రోజుల సెలవుల కారణంగా చాలామంది లులు మాల్ ను సందర్శిస్తున్నారు. మాల్ కు వచ్చే ప్రేక్షకుల కారణంగా కూకట్ పల్లిలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. శనివారం రోజు ఏకంగా మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జేఎన్టీయూ నుండి హైటెక్ సిటీ వెళ్లే మార్గంలో లులు మాల్ నూతనంగా ఏర్పాటయింది. ఈ మాల్ ఓపెనింగ్ రోజు సైతం విపరీతమైన ప్రచారం లభించింది. అటు సోషల్ మీడియాలోనూ ఈ మాల్ పై విపరీతమైన చర్చ నడవ‌డంతో… ఒకసారైనా ఈ మాల్ కు వెళ్లాలని నగరవాసులు ఎగబడుతున్నారు. వీకెండ్ కావడంతో మాల్ కు ఒక్కసారిగా జనం పోటెత్తారు.

మూడు రోజుల సెలవులు కావడంతో ఊర్లకు వెళ్లే బస్సులు సైతం కుకట్ ప‌ల్లి రోడ్డు మీద నుండి వెళ్లడంతో ఒకవైపు ప్రైవేటు బస్సుల ట్రాఫిక్ మరోవైపు లులు మాల్ హడావిడితో కూక‌ట్ ప‌ల్లి రద్ధిగా మారిపోయింది. మాల్ కు వచ్చే జనాల కేంద్రంగా కూకట్పల్లి నుండి జేఎన్టీయూ ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామయ్యి భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మోతాదుకు మించి జనాలు రావడంతో పోలీసులు సైతం చేతులెత్తేశారు. ఈ మాల్ దగ్గర రద్దీ కారణంగా రెండు రోజుల నుండి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గతంలో ఐకియా ప్రారంభోత్సవంలోనూ ఇదే సీన్ కనిపించింది.. ఐకియ స్టోర్ ప్రారంభమైన మొదటి పది రోజులు విపరీతమైన రద్దీ కనిపించడం మ‌నం చూశాం. ఇప్పుడు అక్క‌డ కూడా అదే ప‌రిస్థితి క‌నిపిస్తుంది. 300 కోట్ల రూపాయలతో ఈ మాల్ ప్రారంభించారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago