Balakrishna : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై తెగ ప్రేమ కురిపించిన బాల‌కృష్ఱ‌.. హిందూపురం టూర్ లో కీలక వ్యాఖ్యలు

Balakrishna : ఏపీలో టీడీపీ-జ‌న‌సేన పొత్తు వైసీపీ నాయ‌కుల‌కి వ‌ణుకు పుట్టిస్తున్న విష‌యం తెలిసిందే. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో నేతలు ప‌లు ప్రాంతాల‌లో ప‌ర్య‌టిస్తున్నారు. హిందూపురం నియోజక వర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండవ రోజు పర్యటించారు. బాలయ్యను చూసేందుకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వ‌చ్చి జై బాలయ్య నినాదాలు చేశారు. అనంతరం బాలయ్య హిందూపురం టీడీపీ- జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే వైసీపికి వ్యతిరేకంగా టీడీపీ-జనసేన కార్యాచరణపైనా కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని ఇద్దరమూ రాజకీయాల్లోకి వచ్చామ‌ని చెప్పిన బాల‌య్య‌… టీడీపీ, జనసేన కలయిక రాష్ట్రంలో కొత్త శకానికి నాంది పలుకుతుందని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్నీ అన్నీ అని కాకుండా మొత్తం అన్ని స్థానాలను గెలుచుకోవాలని కోరకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. నేరస్తులు, హంతకుల పాలనతో ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని కూడా ఆయ‌న తెలియ‌జేశారు. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.

Balakrishna sensational comments on pawan kalyan about cm
Balakrishna

రాష్ట్రంలో ఎక్కడ ఒక పని కూడా జరగట్లేదన్నారు. హిందూపురంలో తన సొంత నిధులు, పార్టీ నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు బాలయ్య తెలిపారు. ఏపీ అభివృద్ధి కోసం రెండు పార్టీలు టీడీపీ, జనసేన కలిసికట్టుగా పనిచేస్తాయని బాలయ్య వెల్లడించారు. టీడీపీ- జనసేన కలవడం ఒక కీలకమైన ఘట్టమన్నారు. నాడు ఎన్టీ రామారావు కూడా గతంలో పార్టీలన్నీ ఏకం చేసి అన్యాయంపై తిరుగుబాటు చేసారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ జై టీడీపీ, జై జనసేన నినాదాలు చేశారు. పవన్ కళ్యాణ్ యజ్ఞంలో సమిధ కావడానికి ముందుకొచ్చారని, జనసేన, టీడీపీ కలయిక కొత్త శకానికి నాంది పలికినట్టేనని బాలకృష్ణ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కూ, తనకూ ఎంతో సారూప్య కథ ఉందని, ఇద్ద‌రం ఏది అయిన‌ ముక్కుసూటిగా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతామన్నారు. తాము ఎవరికీ భయపడబోమన్నారు. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. రాష్ట్రంలో పరిపాలన ఇష్టారాజ్యంగా జరుగుతుందని, వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయని బాలకృష్ణ విమర్శించారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago