Sachin Tendulkar : త‌న ముందు కోహ్లీ త‌న రికార్డ్ బ్రేక్ చేయ‌డంతో ఎమోష‌న‌ల్ అయిన సచిన్

Sachin Tendulkar : ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజీలాండ్ పై సెంచరీ సాధించి స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు కోహ్లీ. మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ పేరిట ఉన్న 49 సెంచరీల రికార్డును బద్దలుకొట్టి 50 సెంచరీలతో చరిత్ర సృష్టించాడు విరాట్.59 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ 106బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు . తను అవుటయ్యే సమయానికి 113 బంతుల్లో 117పరుగులు చేశాడు. సెంచరీలతోనే కాకుండా విరాట్ సచిన్ పేరిట ఉన్న మరో రికార్డ్ నూ బ్రేక్ చేశారు. ఇప్పటివరకు ఒక ప్రపంచకప్ సిరీస్ లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు 673 పరుగులతో సచిన్ పేరిట ఉండేది. దానిని 694 పరుగులతో ఈరోజు విరాట్ బ్రేక్ చేశాడు.

రెండు రికార్డులు కూడా సచిన్ టెండూల్కర్ సమక్షంలోనే బ్రేక్ అయ్యాయి… స్టేడియంలో సచిన్ మ్యాచ్ చూస్తుండగా విరాట్ అత్యధిక సెంచరీలు, అత్యధిక పరుగుల రికార్డును సాధించడం ప్రేక్షకులకు మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా మిగిలిపోనుంది. వన్డేల్లో తాను నెలకొల్పిన అరుదైన రికార్డు‌ను కోహ్లీ అధిగమించడంపై సంతోషం వ్యక్తం చేశాడు స‌చిన్.వన్డేల్లో వరల్డ్ రికార్డ్ సాధించిన నేపథ్యంలో విరాట్ కోహ్లీని ట్విటర్ వేదికగా సచిన్ ప్రశంసించాడు. కోహ్లీని తొలిసారి కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు.

Sachin Tendulkar response after virat kohli 50th century
Sachin Tendulkar

‘కోహ్లీ.. భారత డ్రెస్సింగ్ రూమ్‌లో నిన్ను మొదటి సారి కలిసినప్పుడు సహచర ఆటగాళ్లంతా నా కాళ్లు మొక్కాలని ప్రాంక్ చేశారు. ఆ రోజు నేను తెగ నవ్వుకున్నాను. ఆ రోజు నువ్వు నా కాళ్లు మొక్కకపోయినా.. ఈ రోజు ఆటపై నీకున్న పిచ్చి, నైపుణ్యంతో నా హృదయాన్ని టచ్ చేశావ్. ఓ కుర్రాడు వరల్డ్ క్లాస్ ప్లేయర్‌లా ఎదగడం చూసిన నేను చాలా సంతోషంగా ఫీలవుతున్నాను. ఓ ఇండియన్‌గా నా రికార్డ్‌ను అధిగమించావని నేను సంతోషించడం లేదు. వరల్డ్ కప్‌లో సెమీస్ వంటి బిగ్ మ్యాచ్‌లో నా హోమ్ గ్రౌండ్‌లో ఈ రికార్డ్ అధిగమించడం నా సంతోషాన్ని డబుల్ చేసింది.’అని సచిన్ ట్వీట్ చేశాడు. ప్ర‌స్తుతం స‌చిన్ చేసిన ట్వీట్ నెట్టింట వైర్‌గా మారింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago