Balakrishna : ప్రస్తుతం సినిమా పరిధి విస్తరించింది. ప్రేక్షకుడు కూడా కొత్తదనాన్ని కోరుకోకుంటున్నాడు. ఓటీటీ పుణ్యామా అని ప్రేక్షకులు అన్నీ భాషల చిత్రాలు, అన్నీ జోనర్స్ మూవీస్ చూడగలుగుతున్నారు. దీంతో ఒకప్పుడు టాలీవుడ్ కే పరిమితమైన మన హీరో ఇప్పుడు పరభాషల్లోకి కూడా అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలాగే ఒక భాషలో హిట్ అయిన సినిమాలను మరో భాషలోకి రీమేక్ చేయడం సాధారణ విషయం అయ్యింది. సినిమాకు భాష, కులం, మతం, ప్రాంతమనే తేడాలు ఉండవని నిరూపిస్తున్నారు. ఈ మధ్య రీమేక్ సినిమాల ట్రెండ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది.
ముఖ్యంగా ఇతర భాషల్లో హిట్ అయితే ఇక్కడ కూడా హిట్ అవుతుందనే భావనలో ఉన్నారు. ఓ సినిమాని రీమేక్ చేస్తున్నారు అంటే అది యాజ్- ఇట్- ఈజ్ గా చేయకుండా మన నేటివిటీకి దగ్గరగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. రీమేక్ సినిమాను ఎంచుకుంటే కథ, స్క్రీన్ ప్లే లాంటివి రాయాల్సిన అవసరం ఉండదు. దీంతో ఈ మధ్య ఒక ఇండస్ట్రీలో హిట్ అయిన సినిమాను వేరే భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఇక నందమూరి నట సింహం బాలకృష్ణ కూడా ఇతర భాషల్లో వచ్చిన పలు సినిమాలను తెలుగులో రీమేక్ చేశారు. అవేంటో ఓసారి చూద్దాం.. హాలీవుడ్ లో తెరకెక్కిన టోటల్ రీకాల్ సినిమా తెలుగులో బాలయ్య హీరోగా లయన్ గా తెరకెక్కింది.
కమల్ హాసన్ హీరోగా వచ్చిన భారతీయుడు సినిమాను ఒక్కమగాడుగా, హాలీవుడ్ సినిమా బౌర్నె ఐడెంటిటి, ది లాంగ్ కిస్ గుడ్ నైట్ సినిమాలను తీసుకుని విజయేంద్ర వర్మగా రూపొందించారు. ఇక తమిళ సినిమా సామిని తెలుగులో లక్ష్మీనరసింహగా, కన్నడలో వచ్చిన రాజనర్సింహ సినిమాను పలనాటి బ్రహ్మనాయుడుగా తెలుగులో రీమేక్ చేశారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ఎన్ తంగాచ్చి పడిచావా సినిమాను తెలుగులో ముద్దుల మావయ్యగా, మరొక తమిళ సినిమా తంగమన రాసా సినిమాను తెలుగులో ముద్దుల మేనల్లుడిగా రీమేక్ చేశారు. ఎన్టీఆర్ నటించిన సత్యహరిచంద్ర, శకుంతల సినిమాలను తీసుకుని బ్రహ్మర్షి విశ్వాసమిత్రగా తీశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…