Uday Kiran : దివంగత నటుడు ఉదయ్ కిరణ్ వెండితెరకు హీరోగా పరిచయమైన సినిమా చిత్రం. తేజ దర్శకత్వంలో తెరకెక్కిచిన ఈ మూవీతో ఉదయ్ తొలి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత వెంట వెంటనే నువ్వు-నేను, కలుసుకోవాలని వంటి లవ్‌స్టోరీల్లో నటించి హ్యాట్రిక్ కొట్టాడు. అంతేకాదు ఈ చిత్రాలతో లవర్ బాయ్‌గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే స్టార్ హీరో హోదా సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి హిట్‌లు, ప్లాప్‌లు అందుకున్నా అతడి జీవితం చివరకు విషాదంగా ముగిసింది.
ఉదయ్ కిరణ్ నటన.. సొట్టబుగ్గల అందానికి అమ్మాయిల్లో తెగ ఫాలోయింగ్ ఉండేది. ఎంత త్వరగా ఉదయ్ కిరణ్ కెరీర్ తారా స్థాయికి చేరిందో అంతే వేగంతో కిందకు చేరింది. దానికి ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం ఒక కారణం అయితే.. మరో కారణం పర్సనల్ లైఫ్ లో జరిగిన అనేక విషయాలు. చిరంజీవి పెద్ద కూతురుతో ఉదయ్ కిరణ్ కు పెళ్లి నిశ్చయమయింది. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వివాహం క్యాన్సల్ అయిన విషయం తెలిసిందే. వచ్చిన ఆఫర్లను కూడా దర్శకులు నిర్మాతలు వెనక్కి తీసుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి.
ఇదిలావుండగా ఒక ఇంటర్వ్యూలో నటుడు దిల్ రమేష్ ఉదయ్ కిరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఉదయ్ కిరణ్ చనిపోయే సమయానికి తాను అతనితో క్లోజ్ గా ఉన్నానని తెలిపారు. పెద్ద హీరోలు అంటే చాలా రిసర్వ్ డ్ గా ఉంటారని మన కంటే తక్కువ వయస్సు ఉన్న హీరోలు అయితే ఫ్రెండ్లీ గా ఉంటారని తెలిపారు. ఉదయ్ కిరణ్ అప్పట్లోనే 75 లక్షల నుండి కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకున్న హీరో అని చెప్పారు. సక్సెస్ స్ట్రెస్ వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని రమేష్ వెల్లడించారు. దిల్ రమేష్ దిల్ సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…