Balakrishna : నందమూరి బాలకృష్ణ సినిమాలు అంటే అందులో యాక్షన్ సీన్స్ తప్పక ఉండాల్సిందే. చేజింగ్ సీన్స్ లేదంటే కత్తి తిప్పడం, జీపులు పైకి లేపడం వంటివి ఉంటాయని అభిమానులు ఆశిస్తుంటారు. సాధారణంగా బాలయ్య నటించిన ప్రతి సినిమాలో ఇవి కామన్‌గానే ఉంటాయి. కానీ ఒక చిత్రంలో మాత్రం ఒక్క ఫైట్ కూడా ఉండదు. ఆ సినిమా సూపర్ హిట్. ఆ చిత్రం మరేదో కాదు నారినారి నడుమ మురారి. 1990 ఏప్రిల్ 27న విడుదలైన నారీ నారీ నడుమ మురారి చిత్రం బాలకృష్ణ 50వ సినిమా కాగా, ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందింది.
యువచిత్ర బ్యానర్‌పై, కె.నరసింహ నాయుడు నిర్మాతగా, స్టార్ డైరెక్టర్ ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో, శోభన, నిరోషా హీరోయిన్స్‌గా, కైకాల సత్యనారాయణ, శారద ప్రధాన పాత్రల్లో నటించిన నారీ నారీ నడుమ మురారి, 1990 ఏప్రిల్ 27న విడుదలై ఘన విజయం సాధించింది. కమర్షియల్ ఎలిమెంట్స్‌ని పక్కనపెట్టి, ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్స్ హైలైట్‌గా తెరకెక్కిన నారీ నారీ నడుమ మురారి చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. బాలయ్య నటన సినిమాకి హైలెట్ అయ్యింది. బాలయ్య సరసన శోభన, నిరోషా జంటగా కనిపించారు.
తమిళనాడు రాష్ట్రంలోని వేలం చెర్రి అనే ప్రాంతంలో మూవీ చిత్రీకరణ జరిపారు. ఇందులో ఒక్క ఫైట్ సీన్, ఒక్క డ్యాన్స్ స్టెప్ లేకుండా మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు బాలకృష్ణ. అల్లు రామలింగయ్య, బాబూ మోహన్, అంజలీదేవి, రమాప్రభ తదితరులు నటించిన ఈ సినిమాకి తనికెళ్ళ భరణి రచన చేశారు. బాలకృష్ణ కత్తి పట్టినా.. డైలాగ్ చెప్పినా.. తొడగొట్టినా.. థియేటర్ దద్దారిలాల్సిందే. అయితే ఇవేమి లేకున్నా బాక్సాఫీస్ మోత మోగిస్తానని నారీ నారీ నడుమ మురారి సినిమాతో నిరూపించాడు బాలకృష్ణ.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…