ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో సాయి పల్లవి ఒకరు. డ్యాన్స్‌తో పాటు అద్భుతమైన పర్‌ఫార్మెన్స్ తో కుర్రాళ్ల మనసులు గెలుచుకున్న లేడి పవర్ స్టార్ సాయి పల్లవి ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో పలకరించిన, అందులో కొన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో కొంత బ్రేక్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే అత్యంత సహజంగా కనిపించడానికి ప్రయత్నించే సాయి పల్లవి.. చివరికీ తన మొహంపై ఉన్న మొటిమలను మేకప్‌తో ఏ మాత్రం కవర్ చేసుకోదు. మాములు ప్రజలే వాటిని కవర్ చేసేందుకు నానా క్రీములు రాస్తుంటారు. సాయి పల్లవి కూడా అలా ఎన్నో క్రీములు రాసిన కూడా ఫలితం లేదట.
ఒకానొక సందర్భంలో సాయి పల్లవి తన మొటిమల గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. తన మొటిమలే తనకు అందం అని తెలిపింది. మొదట్లో అందరిలా తాను బాధపడ్డట్టు చెప్పిన సాయి పల్లవి ప్రస్తుతం ఎలాంటి ఫీలింగ్ లేదంటుంది. అయితే నా మొహం పై ఇలా మొటిమలు ఉన్నప్పటికీ నాకు సినిమా అవకాశాలు వచ్చాయని తెలిపారు. తాను చూసిన హీరోయిన్స్ ముఖంపై చిన్న మచ్చ కూడా ఉండేది కాదని, నా ముఖంపై అన్ని మొటిమలు ఉండడంతో మొదట్లో భయం వేసిందని పేర్కొంది.
ప్రేమమ్ సినిమాలో ఎలాంటి మేకప్ లేకుండా మొటిమలతోనే ఆ సినిమాలో నటించానని తెలిపింది సాయి పల్లవి. ఇలా సినిమాలో నన్ను చూడటం వల్ల ఎంతో మంది అమ్మాయిలకు వారిపై ఆత్మవిశ్వాసం పెరిగిందని సాయి పల్లవి చెప్పుకొచ్చారు. పైకి కనిపించే అందం కంటే క్యారెక్టర్ ముఖ్యమని, అందరూ అదే చూస్తారని అప్పుడు తెలిసిందని చెప్పింది. ఇటీవలే నాగ చైతన్య సరసన లవ్‌స్టోరీ సినిమా చేసి సూపర్ డూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది సాయి పల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా థియేటర్స్ రీ- ఓపెన్ అయ్యాక ఘన విజయం సాధించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…