Balakrishna : నందమూరి బాలకృష్ణది చిన్న పిల్లాడి మనస్తత్వం అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఆయన ఒక్కోసారి సీరియస్ గా ఒక్కోసారి చాలా జాలీగా ఉంటారు. ఏం చేసిన కూడా బాలయ్య మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాడు. నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా ‘వీరసింహారెడ్డి’ సినిమా మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా విజయంతో మంచి హుషారు మీద ఉన్న బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. దసరాకు రాబోతుంది. కామెడీ డైరెక్టర్ సీరియస్ హీరోతో సినిమా చేస్తుండడం ఆసక్తిని కలిగిస్తుంది.
బాలయ్యకి అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకు కారణం ఆయన సినిమాలే కాదు నలుగురితో కలిసి ముందుకు సాగడం. బాలయ్య ఎప్పుడు ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తూనే ఉంటారు. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన కల్ట్ క్లాసిక్ చిత్రం “భైరవ ద్వీపం” మరోసారి థియేటర్స్‌లో విడుదలకానుంది. దీనికి సంబంధించి కొన్ని పోస్టర్స్‌ను ఇప్పటికే విడుదల చేశారు ఫ్యాన్స్. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు అద్భుత సృష్టిలో ఒక చిత్రంగా వచ్చిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ అయితే ఇప్పుడు 4K లో రీరిలీజ్ కాబోతుంది.. ఈ సినిమాను జూన్ 10న రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.
గత కొద్ది రోజులుగా రాజకీయాలతో బిజీగా ఉన్న బాలయ్య హీట్ పుట్టించే హాట్ కామెంట్స్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇక రీసెంట్‌గా బాలయ్య చేతుల మీదుగా ఓ మూవీ ట్రైలర్ లాంచ్ చేయగా, ఆ సమయంలో ఆయన చేసిన ఫన్ అందరికి తెగ నవ్వు తెప్పిస్తుంది. దర్శకుడిని నెత్తి మీద వెంట్రుకలు అన్ని పోయాయి, బాగా ఏడిపించారా అంటూ సెటైర్ వేశారు. ఇక హీరోయిన్‌ని తన పక్కకు వచ్చి నిలుచోమని అన్నారు. అందరితో సరదగా మాట్లాడి హాట్ టాపిక్ అయ్యారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…