Sidhu Jonnalagadda : ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు వాడలు, పట్టణాలు, దేశాలు, విదేశాలలో అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల వేడుక అంగరంగ వైభవంగా జరగగా, ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు తరలి వచ్చారు. చిన్న హీరోల నుండి పెద్ద హీరోల వరకు వేడుకకి హాజరు కావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ తో కలసి నటించిన జయసుధ, జయప్రద, మురళీ మోహన్ సహా.. ఇతర నటీనటులు ఆయన జ్ఞాపికలు అందుకున్నారు. హీరోలు వెంకటేష్, రామ్ చరణ్, నాగచైతన్య, సుమంత్, సిద్ధు జొన్నలగడ్డ, అడవి శేష్.. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్.. ఎన్టీఆర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.
బాబు మోహన్, విజయేంద్ర ప్రసాద్, అల్లు అరవింద్, అశ్వినీదత్, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, అనిల్ రావిపూడి, శ్రీలీల ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే అందరు కూడా ఎన్టీఆర్ గొప్పతనం గురించి ఘనంగా చెబుతూ వచ్చారు. యువ హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా ఎన్టీఆర్ గురించి చాలా గొప్పగా చెప్పారు. అయితే ఆ సమయంలో సిద్ధు పక్కన బాలకృష్ణ నిలుచొని ఉండడంతో కొంత ఇబ్బందిగా ఫీలయ్యాడు. సార్ మీరు పక్కన ఉంటే మాటలు రావడం లేదు అన్నట్టు చెప్పాడు. దీంతో బాలయ్య కాస్త పక్కకు వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియొ నెట్టింట వైరల్ అయింది.
యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ప్రజంట్ మంచి జోష్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇతగాడు మంచి రైటర్ కూడా. ఇటీవల ‘డీజే టిల్లు’ మూవీతో తన యాక్టింగ్‌తో పాటు తన పెన్ను పవరేంటో కూడా చూపించాడు. గతేదాది విడుదలైన ఈ సినిమా సెన్సేసన్ క్రియేట్ చేసింది. కలెక్షన్లతో హోరెత్తించింది. ప్రజంట్ ‘టిల్లు స్క్వేర్’ తెరకెక్కించే పనిలో ఉన్నాడు సిద్దు. అయితే బాలయ్య ‘ఆహా’ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ సెకండ్ సీజన్‌కు మరో హీరో విశ్వక్ సేన్‌తో కలిసి సిద్ధు జొన్నలగడ్డ హాజరై సందడి చేశాడు. . ఈ క్రమంలోనే ఈ కుర్ర హీరోలకు బాలయ్యతో మంచి బాండింగ్ ఏర్పడింది. నటసింహం రియల్ లైఫ్‌లో ఎలా ఉంటారు.. ఆయన క్యారెక్టర్ ఏంటి అన్నది వీరికి అర్థమయ్యింది.అప్పటి నుండి వీరు చాలా స్నేహంగా మెలుగుతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…