Balakrishna : టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరైన బాలయ్య తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. అఖండ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న బాలయ్య ఆ తర్వాత కూడా అంతకుమించి అనేలా సక్సెస్ అందుకోవడం కోసం కృషి చేస్తున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 107వ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ కూడా అభిమానుల్లో భారీ అంచనాలు పెంచింది. ఇక ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనుండగా, ఈ మూవీలో నెవర్ బిఫోర్ అనే విధంగా బాలయ్య కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక నందమూరి బాలకృష్ణలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికే షో. ఈ షోతో బాలయ్య అందరికీ మరింత దగ్గరయ్యాడు. ఈ షో తరువాత బాలయ్య మీద అందరికీ సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. అప్పటి వరకు ఆయనను కోపిష్టి అన్న వాళ్లు ఆ తర్వాత జోవియల్ పర్సన్ అని అనడం మొదలు పెట్టారు. తోటి హీరోలతో బాలయ్య కలసిపోయిన తీరు, అల్లుకుపోయిన విధానం అన్నీ కూాడా అందరినీ ఆకట్టుకున్నాయి. తొలి సీజన్ మంచి హిట్ కొట్టడంతో రెండో సీజన్ మొదలు పెట్టేందుకు కసరత్తులు చేస్తున్నారు.
దసరా కానుకగా మొదటి ఎపిసోడ్‌ను రెడీ చేయాలని టీం భావిస్తోందట. ఎలాగైనా సరే అక్టోబర్‌లో ఎపిసోడ్స్ ప్రసారం అయ్యేలా చూడాలని అనుకుంటోందట. అయితే ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ మీద అందరికీ అంచనాలు పెరిగిపోతోన్నాయి. దానికి చిరంజీవి వస్తాడని అంటున్నారు. అయితే ఫస్ట్ సీజన్‌లో ఓ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోలో బాలయ్య.. ఈరోజు మంగళవారం కదా ఏంఏం వండాలో అంటూ వంట వండే వ్యక్తికి మెనూ ఫోన్ లో చెబుతాడు. బ్రేక్ ఫాస్ట్ నుండి డిన్నర్ వరకూ తనకు ఇష్టమైన వంటకాలు అన్నీ బాలయ్య వంటమనిషికి చెప్పాడు.
బ్రేక్ ఫాస్ట్ లోకి తనకు ఊతప్పం మరియు జీడిపప్పు ఉప్మాను టిఫిన్ గా చేయమని చెప్పగా అందులోకి కొబ్బరి చట్నీ ఉండాలని అన్నాడు. ఇక లంచ్ కోసం బంగాళ దుంప కూర చేయమని చెబుతూ అందులో వెల్లుల్లి భాగా దంచి వేయమన్నాడు. ఇక ఓమతో రసం చేయమని కోరగా డిన్నర్‌కి దొండకాయ మరియు కాలీ ఫ్లవర్ చేయాలంటూ ఆర్డర్ వేశాడు. అందులో కూడా వెల్లుల్లి భాగా వేసి మసాలా దట్టించమని చెప్పాడు. మొత్తానికి తన ఫుడ్ మెనూతో వంట మాస్టార్‌ని తికమక పెట్టేశాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…